ఆసియా కప్ 2025 ట్రోఫీపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఫైనల్ ముగిసి 20 రోజలు దాటినా.. ట్రోఫీ, మెడల్స్ ఛాంపియన్ భారత జట్టు చేతికి రాలేదు. ఇందుకు ప్రధాన కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ. తాజాగా భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) నుంచి హెచ్చరిక ఇ-మెయిల్ వెళ్లినా.. నఖ్వీ తగ్గేదేలే అంటున్నాడు. ఆసియా కప్ 2025 ట్రోఫీని తన చేతుల మీదుగానే టీమిండియాకు ఇస్తా అని…
Asaduddin Owaisi: ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరగనున్న భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌పై రాజకీయ, సామాజిక వివాదం ముదురుతోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని ప్రతిపక్షాలు, బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ఏఐఎంఐఎం చీఫ్, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఓ మీడియా సంస్థతో ఒవైసీ మాట్లాడుతూ..
India-Pakistan match: బీజేపీ ఫైర్ బ్రాండ్, మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే మరోసారి ఉద్ధవ్ సేన పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్‌లో జరగనున్న ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చుట్టూ ఉన్న వివాదం నేపథ్యంలో, మ్యాచ్‌పై ఉద్ధవ్ ఠాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై నితేష్ రాణే, ఆదిత్య ఠాక్రేపై ఎగతాళి వ్యాఖ్యలు చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఆదిత్య ఠాక్రే బురఖా ధరించి మ్యాచ్‌ను రహస్యంగా చూస్తాడని రాణే ఆరోపించారు.