Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
- నాలుగోసారి కూడా శాంతి ఒప్పందంపై సంతకానికి నో..
- నవంబర్ 20న హాజరుకావాలని నేహాబోరాకు కోర్టు ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neha Bora: ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ‘‘శాంతి ఒప్పందం’’పై సంతకం చేసేందుకు నాలుగోసారి కూడా నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్(SEM) కోర్టు ఆమెను తమ ముందు నవంబర్ 20న హాజరుకావాలని ఆదేశించింది. శాంతియుత నిరసన నేరం కాదని నేహాబోరా వాదిస్తోంది. భావప్రకటన స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కును పీస్ బాండ్ పేరుతో అణచివేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో శాంతిభద్రతలకు భంగం వాటిల్లిందని పోలీసులు అనుమానించడానికి ఆధారమైన 6 ఎఫ్ఐఆర్లు, దర్యాప్తు పత్రాలన్నింటిని నేహాబోరాకు అందించాలని ఎస్ఈఎం కోర్టు ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. ఈమేరకు పోలీసులు డాక్యుమెంట్లను నేహా బోరాకు అప్పగించారు. దీనికిముందు 2026 అక్టోబర్ 23న పోలీసులు జారీ చేసిన షో-కాజ్ నోటీసులు, సమన్లను రద్దు చేయాలని నేహా బోరా ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. నేహా బోరా పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.
Also Read
- Bangladesh: షేక్ హసీనా వీడియో వివాదం.. బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మృతి..
- Naseeruddin Shah: 'నేను దిమాగీ నక్సల్‌నే'.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు..
- El Nino: భారత్‌పై "ఎల్ నినో" పంజా.. మార్చి నాటికి 55 వేల మరణాలు!
- Silver Price: కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరల్లో ఊహించని మార్పులు..
జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేక నిరసనలతో ప్రారంభమైన కేసు.
ఈ మొత్త వ్యవహారం 2026 అక్టోబర్ 16న ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు, నిరసనలకు పిలుపునివ్వడంతో ప్రారంభమైంది. ఈ నిరసన చట్టవిరుద్ధమని, ఢిల్లీ పోలీసులు భారత శిక్షా స్మృతి (BNSS)లోని సెక్షన్ 126 కింద నేహా బోరాపై చర్య తీసుకోవాలని సిఫార్సు చేశారు. జంతర్ మంతర్ వద్ద ఆంక్షలు ఉన్నప్పటికీ అక్కడికి వెళ్లడానికి, వెళ్లేలా గుంపును ప్రేరేపించారనే అభియోగాలు నేహా బోరాపై ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే నేహా బోరాను శాంతి ఒప్పందంపై సంతకం చేయాలని ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ప్రజాస్వామ్య హక్కులకు ఇది విరుద్ధమని ఆమె వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 20న ఎస్ఈఎం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
-
AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
-
Women’s Health : 40 ఏళ్లకే మెనోపాజ్.? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
-
ChatGPT: ప్రాణాలు తీసిన ChatGPT వైద్యం.. మూర్ఛ వ్యాధితో మహిళ మృతి.. ఓపెన్ఏఐపై దావా..
-
Diwali Bonus: దీపావళి ధమాకా.. ఆ ఉద్యోగులకు భారీగా బోనస్!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?