Naseeruddin Shah: ‘నేను దిమాగీ నక్సల్‌నే’.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మధ్య మాటల యుద్ధం మొదలైంది. విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా మాట్లాడిన నసీరుద్దీన్ షాను కిరణ్ రిజిజు విమర్శించారు. ఆయనను ‘ప్రమాదకరమైన అర్బన్ దిమాగీ నక్సల్’ అని అభివర్ణించిన మంత్రి, ఆయన వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యానికి ఎంతో హానికరమని అన్నారు. ఒకప్పుడు ఆయనను ఎంతో గౌరవించేవాడినని, కానీ ఆయన నిజస్వరూపం ఆలస్యంగా తెలిసిందని పేర్కొన్నారు.
ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి యూనియన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా నసీరుద్దీన్ షా ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియోలో ఆయన ‘దిమాగీ నక్సల్’ అని రాసి ఉన్న బ్యాడ్జ్ ధరించి కనిపించారు. దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి, యువత ధైర్యాన్ని దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. “నేను దిమాగీ నక్సల్‌నే అని గర్వంగా చెబుతున్నాను. నాలాంటి వారిని దేశద్రోహులని, తుక్డే-తుక్డే గ్యాంగ్ అని పిలుస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇంకా ఎంతకాలం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతుంది?” అని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
- Ind Vs Nepal: నేపాల్‌పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
- OTR: రాజమహేంద్రవరం వైసీపీలో వెన్నుపోట్ల కలకలం
ఈ వ్యాఖ్యలపై శివసేన నాయకురాలు షైనా ఎన్‌సి కూడా స్పందించారు. నసీరుద్దీన్ షా ‘సర్ఫరోష్’ సినిమాలో ఏసీపీ రాథోడ్ లాగా ఆలోచిస్తున్నారా లేక విలన్ గులామ్ హసన్ లాగా ఆలోచిస్తున్నారా అని ప్రశ్నించారు. ఆయన దేశానికి అనుకూలంగా ఉన్నారో లేక వ్యతిరేకంగా ఉన్నారో స్పష్టం చేయాలన్నారు.
I thought Naseeruddin Shah was just an ordinary actor. I used to respect & like him.. I never knew that he was a dangerous urban Dimagi Naxal !
मुझे उसके असली चरित्र के बारे में बहुत देर से पता चला।। भारत के लोकतंत्र के लिए अत्यंत हानिकारक है। https://t.co/McSDNBJjPt
— Kiren Rijiju (@KirenRijiju) October 28, 2026
‘దిమాగీ నక్సల్’ అనే పదాన్ని గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఉపయోగించారు. వ్యవస్థలోకి ప్రవేశించి విధానాలను తప్పుదోవ పట్టించేవారిని ఉద్దేశించి ఆయన ఈ పదాన్ని వాడారు. గత కొన్ని రోజులుగా నీట్ పరీక్షలో అక్రమాలు, వివిధ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లలో విద్యార్థుల నిరసనలకు మద్దతుగా నసీరుద్దీన్ షా నిత్యం వీడియోలు విడుదల చేస్తూ ప్రభుత్వంపై తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!