Diwali Bonus: దీపావళి ధమాకా.. ఆ ఉద్యోగులకు భారీగా బోనస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali Bonus: పండుగ సీజన్ మొదలవుతుందంటేనే ఉద్యోగుల కళ్లన్నీ బోనస్‌ల వైపే ఉంటాయి. అలాంటిది పండుగ పూట చేతినిండా పైసలు అందుతాయంటే ఆ ఆనందమే వేరు. సరిగ్గా దీపావళికి ముందే ఆ ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు చెప్పింది. ఏటా ఇచ్చే పండుగ నజరానాను ఈసారి మరింత పెంచుతూ.. ఏకంగా రూ.33,000 బోనస్ ఇస్తున్నట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారికంగా ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే రూ.2,000 అదనంగా పెంచడంతో ఉద్యోగుల ఇళ్లలో పండుగ వెలుగులు ముందే మొదలయ్యాయి.
ఈ నిర్ణయంతో కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న దాదాపు 93,509 మంది అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. కేవలం రెగ్యులర్ ఉద్యోగులే కాకుండా ఎయిడెడ్ పాఠశాలల టీచర్లు, నాన్-టీచింగ్ స్టాఫ్, హెల్త్ వాలంటీర్లు, కిండర్‌గార్టెన్ టీచర్లకు కూడా ఈ పండుగ కానుక అందనుంది. పండుగ షాపింగ్‌లు, ఇంటి ఖర్చుల కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలకు ఈ బోనస్ పెద్ద ఊరటనిచ్చినట్లయింది.
Also Read
- Silver Price: కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరల్లో ఊహించని మార్పులు..
- PM Kisan 24th Installment 2026: PM-KISAN 24వ విడత.. రైతుల ఖాతాల్లోకి రేపే రూ.2,000.. ఈసారి ప్రత్యేకత ఏంటంటే?
- Cancer Drug Price Cut 2026: క్యాన్సర్ మందుల ధరల్లో భారీ తగ్గింపు.. రూ.80 వేల ఇంజెక్షన్ ఇప్పుడు రూ.7,150కే!
- Amazon Layoffs 2026: అమెజాన్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. పొద్దు పొద్దున్నే 250 మంది ఉద్యోగులకు షాక్!
గత ఏడాది బీఎంసీ సిబ్బందికి రూ.31,000 బోనస్ అందగా, ఈసారి దాన్ని రూ.33 వేలకు పెంచారు. యూనియన్ల డిమాండ్లు, ఆర్థిక పరిస్థితులపై వివిధ పార్టీల ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయంపై ఏకాభిప్రాయం కుదిరింది. నవంబర్ నెల సాధారణ జీతంతో పాటే ఈ బోనస్ మొత్తాన్ని కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని మేయర్ ఇప్పటికే పరిపాలనా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పండుగకు ముందే ఖాతాల్లో భారీ మొత్తం జమ కానుండటంతో కార్మిక వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Diwali Bonus: దీపావళి ధమాకా.. ఆ ఉద్యోగులకు భారీగా బోనస్!
-
Vijayendra Prasad : ఏప్రిల్ 7 2027న వారణాసి తప్పకుండా రిలీజ్ అవుతుంది
-
El Nino Impact : ఎల్‌నినో దెబ్బ.. తెలంగాణలో 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం
-
UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..
-
Zodiac Signs : అక్టోబర్ 31 నుంచి గురు-కేతు కలయిక.. ఈ 6 రాశుల వారు జాగ్రత్త
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?