Bangladesh: షేక్ హసీనా వీడియో వివాదం.. బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మృతి..
- బంగ్లాదేశ్‌లో సంచలనంగా మారిన మాజీ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి మరణం..
- షేక్ హసీనా దేశం విడిచిపెడుతున్న వీడియోతో లింక్..
- హత్య చేశారంటూ మృతుడి బంధువుల ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 2024 ఆగస్టులో దేశం విడిచి ఇండియాకు వస్తున్న సమయంలో, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆమె మిలిటరీ హెలికాప్టర్ ఎక్కుతున్న వీడియో అప్పుడు సోషల్ మీడియాలతో సంచలనంగా మారింది. ఈ వీడియోతో సంబంధం ఉందని భావిస్తున్న మాజీ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ కేఎం తహ్సీఫ్ సౌదీ ఇప్పుడు అనుమానాస్పదంగా మరణించారు. షేక్ హసీనా డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని ప్రకటించిన సమయంలో ఈ మరణం చోటుచేసుకుంది.
ఢాకాలోని తురాగ్ నదిలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 28 ఏళ్ల సౌరీ అక్టోబర్ 27 నుంచి కనిపించకుండా పోగా, అక్టోబర్ 28న ఆయన మృతదేహం లభ్యమైంది. సౌరీది హత్యేనని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తొలుత గుర్తుతెలియని మృతదేహంగా భావించినప్పటికీ, ఆయన ఐఫోన్, చేతి గడియారం ద్వారా మృతుడు సౌరీ అని పోలీసులు గుర్తించారు. ఆయన మరణానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక తర్వాత స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
Also Read
- US Fed Interest Rate Decision: అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం
- Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ, 46 మంది మృతి
- Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
- Israel Election Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్?.. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్షానికి ఆధిక్యం
షేక్ హసీనా వీడియో కారణంగానే హత్య జరిగిందా..?
షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచివెళ్తున్న వీడియో సమయంలో సౌరీ పేరు వినిపించింది. ఆయన బంధువు మోష్ఫేకా జహాన్ సోషల్ మీడియాతో దీనిని హత్యగా ఆరోపించారు. హసీనా దేశం విడిచి వెళ్తున్న సమయంలో వైరల్ అయిన వీడియోతో ఆయన వేధింపులకు గురయ్యారని, ఆ తర్వాత హత్యకు గురయ్యారని ఆరోపించారు. హసీనా పారిపోతున్న వీడియోను షేర్ చేయడమే ఆయన తప్పా? అని ప్రశ్నించారు. అయితే, ఆ వీడియోను సౌరీ స్వయంగా చిత్రీకరించలేదని, మరో సహోద్యోగి రికార్డ్ చేసిన దృశ్యాలను ఆయన షేర్ చేశారని జహాన్ ఆరోపించారు. వీడియో ప్రచారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీవ్ర మానసిక వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా డిటెక్టివ్లు ఆయనను వెంబడించే వారని ఆరోపించారు. ఆయన మరణానికి ముందు కొందరు ఇంటి నుంచి బయటకు పిలిచారని ఆరోపించారు.
షేక్ హసీనా దేశాన్ని విడిచిన రోజు ఏం జరిగింది.?
హింసాత్మక విద్యార్థి ఆందోళన కారణంగా ఆగస్టు 5, 2024న షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి, భారత్ పారిపోయి వచ్చారు. సుమారు 15 ఏళ్ల పాలన అనంతరం ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిపెట్టారు. ఆ రోజు బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన C-130J హెర్క్యులెస్ విమానంలో ప్రయాణించి, భారతదేశంలోని ఘజియాబాద్ సమీపాన ఉన్న హిండన్ వైమానిక స్థావరానికి చేరుకున్నట్లు సమాచారం. ఆమె ప్రయాణమవుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి.
దీని తర్వాత సౌరీని 2025 ఆగస్టు 4న ఎయిర్ ఫోర్స్ బలవంతంగా రాజీనామా చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి. హసీనా వీడియో కారణంగానే ఆయనపై చర్యలు తీసుకున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Bangladesh: షేక్ హసీనా వీడియో వివాదం.. బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మృతి..
-
Bevon Jacob: అభిషేక్ ఇన్నింగ్స్‌ను కలలో కూడా మర్చిపోలేకపోతున్నాం.. నాలుగో టీ20కి ప్లాన్‌తో దిగుతున్నాం..
-
Naseeruddin Shah: ‘నేను దిమాగీ నక్సల్‌నే’.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు..
-
El Nino: భారత్‌పై “ఎల్ నినో” పంజా.. మార్చి నాటికి 55 వేల మరణాలు!
-
Trivikram Srinivas: ఆ హీరోయిన్ కాళ్లపై పడ్డారా? గురూజీ అదిరిపోయే క్లారిటీ!
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..