Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి విజయవాడ కోర్టులో దాఖలు చేసిన ప్రైవేట్ కంప్లైంట్‌పై జరుగుతున్న తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సాయి కృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో అదే అంశంపై ప్రైవేట్ కంప్లైంట్ ఆధారంగా సమాంతరంగా చర్యలు చేపట్టడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయపడింది.
సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, సౌత్ జోన్ ఏసీపీని నిందితులుగా చేర్చాలంటూ ఎంపీ గురుమూర్తి విజయవాడ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. దీనిపై ఫిర్యాదుదారు, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రక్రియ ప్రారంభించింది. అయితే ఈ ప్రక్రియను సౌత్ జోన్ ఏసీపీ హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా, మరోవైపు ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా సమాంతర చర్యలు చేపట్టడం విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.
Also Read
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
దీంతో ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన ప్రైవేట్ కంప్లైంట్‌పై విజయవాడ కోర్టులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ తేదీ వరకు ఈ స్టే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారు ఎంపీ మద్దెల గురుమూర్తికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!