సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య బంధం చెడింది. ట్రంప్-మోడీ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాజాగా ఆ బంధం మళ్లీ చిగురిస్తున్నట్లుగా కనిపిస్తోంది. త్వరలోనే భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశాలు ఉన్నట్లుగా నివేదికలు అందుతున్నాయి.
పాకిస్థాన్‌తో అమెరికాకు వాణిజ్య డీల్ కుదిరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. భవిష్యత్‌లో భారత్‌కు పాకిస్థాన్ చమురు కూడా విక్రయించొచ్చని తెలిపారు. ఇక భారత్‌పై 25 శాతం సుంకం విధించినట్లు వెల్లడించారు.