పంజాబ్ కాంగ్రెస్ నాయకురాలు నవజ్యోత్ సిద్ధూ సతీమణి కౌర్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమేనని.. అయితే పంజాబ్ ముఖ్యమంత్రి కావడానికి ‘రూ. 500 కోట్ల సూట్‌కేస్’ అవసరమని.. అంత డబ్బు తమ దగ్గర లేదన్నారు.
పాటియాలా కోర్టు నుంచి ఇటీవలే విడుదలైన మాజీ క్రికెటర్, పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ నవజ్యోత్ సిద్ధూ రాహుల్ గాంధీని కలిసారు. 10 నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన సిద్ధూ ఈరోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను కలిశారు. పంజాబ్ కోసం పని చేయడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.
Navjot Sidhu: 34 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఒకరి మరణానికి కారణం అయిన కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ 10 నెలల తర్వాత ఈ రోజు పాటియాలా జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల కాగానే బీజేపీ, ప్రధాని మోదీ టార్గెట్ గా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. ప్రజాస్వామ్యం సంకెళ్లలో ఉందని అంటూ విమర్శించారు. పంజాబ్ దేశానికి రక్షణ కవచం, ఈ దేశంలో నియంతృత్వం వచ్చినప్పుడు.. రాహుల్ గాంధీ నేతృత్వంలో విప్లవం వచ్చింది అంటూ సిద్ధూ…
పంజాబ్‌లో పాలన సవ్యంగా నాలుగు రోజులు సాగితే రెండు రోజులపాటు రగడ జరుతుంది. పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన తరువాత ముఖ్యమంత్రులను నిద్రపోకుండా చేస్తున్నారు. పక్కలో బల్లెంమాదిరిగా మారిపోయాడు. ఇటీవలే ఇసుక విషయంలో ముఖ్యమంత్రి ఇసుక విషయంలో తప్పుడు లెక్కలు చెప్పబోతుంటే, వారించి ప్రభుత్వం ఇప్పటికీ ఇసుకను రూ. 20 కి అమ్ముతున్నట్టు చెప్పారు. ప్రజల ముందు సర్కార్‌ను తక్కువ చేసి చూపడంతో పరువు పోయింది. ఇప్పుడు మరో సమస్యను ప్రభుత్వం ముందుకు…
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఒకటి తర్వాత మరోటి అన్నట్టు కొత్త కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి.. నవజ్యోత్ సింగ్, సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య వివాదాలతో.. చివరకు అమరీందర్ పార్టీని కూడా వీడి వెళ్లిపోగా.. కాంగ్రెస్ అధిష్టానం నియమించిన కొత్త సీఎం చరణ్‌జిత్ చన్నీతో కూడా సిద్ధూకు పొసగని పరిస్థితి వచ్చింది.. అయితే, ఈ పరిణామంలో మాత్రం తన పంతాన్ని నెగ్గించుకున్నారు ఈ మాజీ క్రికెటర్.. సిద్ధూ డిమాండ్లకు ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ దిగివచ్చారు..…
కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. పంజాబ్ కాంగ్రెస్ సర్కార్‌లో నెలకొన్న సంక్షోభంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటు అయ్యింది.. అయితే, రాజీనామా చేసినప్పట్టి నుంచి మౌనంగా ఉన్న కెప్టెన్.. ఇవాళ ఒక్కసారిగా.. రాష్ట్ర నేతల నుంచి అధిష్టానం వరకు ఎవ్వరినీ వదిలేదు లేదన్నట్టుగా ఫైర్ అయ్యారు.. కాంగ్రెస్ పార్టీలో అగ్ర నేతలైనా…
ఎన్నికలు సమీపిస్తున్న పంజాబ్ కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై నలుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలిని సరిగా లేదని… అయన్ను వెంటనే మార్చాల్సిందేనని సిద్ధూ వర్గం నేతలు పట్టుబట్టారు. అవసరం అయితే, సోనియా గాంధీని కలుస్తామని ప్రకటించారు. ఇంతలోనే పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకులు హరీష్‌రావత్… అసంతృప్తవర్గానికి చెందిన నలుగురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. నలుగురు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు… రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి వివరించారని…
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షభానికి తెరదించేందుకు రంగంలోకి దిగారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ… ఢిల్లీ వెళ్లిన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఆమెతో చర్చలు జరిపారు.. అంతర్గత విభేదాలతో, సంక్షోభంలో పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ సతమతమవుతోంది.. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ తో ఢీ అంటున్నారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఈ రోజు ఉదయం కూడా “బూటకపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల” వల్ల పంజాబ్ ప్రజల పై వేల కోట్ల రూపాయల అధిక భారం మోపారని…
పంజాబ్ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్… సోనియా గాంధీ కలవనున్నారని సమాచారం. రేపు సాయంత్రం సోనియా అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూను పార్టీలో లేదా ప్రభుత్వంలో సర్దుబాటు చేయడానికి… కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అమరీందర్‌సింగ్‌లో సోనియా సమావేశం ఆసక్తి రేపుతోంది. ఇక సిద్దూ ఇప్పటికే రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీ కలిశారు. సీఎం అమరీందర్‌సింగ్,…