Nagpur Man Dies After Taking 2 Viagra, While Drinking Alcohol: డాక్టర్ల సూచన లేకుండా ఏది పడితే అది వాడితే ఎలా ఉంటుందో తెలుసా..? ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. రతిలో శక్తి కోసం వయగ్రా వేసుకున్నాడు. దీంతో పాటు ఆల్కాహాల్ తాగాడు. చివరకు మరణించాడు. ఈ ఘటన మహరాష్ట్ర నాగ్ పూర్ లో జరిగింది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలాంటి మరణాలు సంభవిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నాగ్‌పూర్‌లో 41 ఏళ్ల వ్యక్తి మద్యం తాగేటప్పుడు రెండు వయాగ్రా మాత్రలు తీసుకున్న తరువాత మరణించాడు. ఈ కేసు గురించిన వివరాలను ‘‘జర్నల్ ఆఫ్ ఫోరెన్సిక్ అండ్ లీగల్ మెడిసిన్’’లో ప్రచురించారు.
Read Also: Gay Partner : వ్యాపారి.. పార్టనర్.. మధ్య కుదరని ఆ సంబంధం.. సుత్తితో కొట్టి దారుణంగా..
ఓ వ్యక్తి హోటల్ గదిలో తన గర్ల్ ఫ్రెండ్ ను కలిసేందుకు వెళ్లాడు. అక్కడ అతడు రెండు 50ఎంజీ సిల్డెనాఫిల్ టాబ్లెట్లను తీసుకున్నాడు. దీన్ని వయగ్రా బ్రాండ్ పేరుతో విక్రయిస్తుంటారు. ఇదే సమయంలో సదరు వ్యక్తి మద్యం సేవించాడు. మరుసటి రోజు ఉదయం తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. తీవ్రమైన వాంతులు చేసుకున్నాడు, అయితే ఆ సమయంలో వైద్య సహాయాన్ని కోరాల్సిందిగా అతడి గర్ల్ ఫ్రెండ్ ఎంత చెప్పినా వినలేదు. తాను ఇంతకు ముందు కూడా ఇలాంటి లక్షణాలను అనుభవించినట్లు, గర్ల్ ఫ్రెండ్ సలహాను తోసిపుచ్చాడు.
చివరకు ఆరోగ్యం దిగజారడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సదరు వ్యక్తి మరణించాడు. 41 ఏళ్ల వ్యక్తి సెరెబ్రోవాస్కులర్ రక్తస్రావంతో మరనించినట్లు తేలింది. ఇది మెదడుకు ఆక్సిజన్ డెలవరీ తగ్గినప్పుడు ఏర్పడే ఓ స్థితి. పోస్టుమార్టం నివేదిక ప్రకారం 300 గ్రాముల రక్తం మెదడులో గడ్డకట్టినట్లు తేలింది. మద్యం, వయగ్రాల కలయిక, హై బీపీ అతడి మరణానికి కారణం అయినట్లు వైద్యులు తేల్చారు. వైద్య సలహా లేకుండా ఇలాంటి అంగస్తంభన ట్యాబ్లెట్లను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను వివరించేందుకు ఈ అరుదైన కేసును జర్నల్ లో ప్రచురించినట్లు రచయితలు పేర్కొన్నారు.