Gay Partner : ఫిబ్రవరి 28న మైసూరు రోడ్డులోని నాయండహళ్లిలోని పాత భవనంలో 44 ఏళ్ల వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. తన స్వలింగ సంపర్క భాగస్వామే అతడిని కొట్టి చంపాడు. ఆ వ్యాపారవేత్త వారి సంబంధాన్ని ముగించాలని తన భాగస్వామి చేసిన విజ్ఞప్తిని వ్యతిరేకించడంతో భాగస్వామే అతడిని కిరాతకంగా చంపేశాడు.
పోలీసులు తెలిపిన వివరాలు.. లియాకత్ అలీ ఖాన్ అనే వ్యక్తి ప్రింటింగ్ ఏజెన్సీని నడుపుతున్నాడు. లియాకత్ ఫిబ్రవరి 22 న రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతకముందే అతడికి మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరితో అతను చంద్రా లేఅవుట్‌లో నివసిస్తున్నాడు. జెజె నగర్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఇలియాజ్‌కు మూడేళ్ల క్రితం జిమ్‌లో లియాకత్‌తో పరిచయం ఏర్పడింది. స్నేహితులుగా మారిన సంవత్సరం తర్వాత, వారి స్నేహం కాస్త లైంగిక సంబంధంగా మారింది.
Read Also: Gun Fire: ఖాసింకు కోపం వచ్చింది.. గర్ల్ ఫ్రెండ్కు బుల్లెట్ దిగింది
ఘటన జరిగిన రోజు వీరిద్దరూ లియాకత్ పాత భవనంలో కలిశారు. శృంగారం తర్వాత విడిపోయే విషయమై గొడవ పడ్డారు. ఇలియాజ్ తన తల్లిదండ్రులు నిర్ణయించిన అమ్మాయితో వివాహం చేసుకోవాలనుకున్నాడని.. లియాకత్‌తో తన సంబంధాన్ని ముగించాలని పోలీసులు తెలిపారు. కానీ లియాకత్ సంబంధాన్ని ముగించడానికి నిరాకరించాడు. ఇదే విషయమై చాలా రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే లియాకత్ ను కోపోద్రిక్తుడైన ఇలియాస్ సుత్తితో కొట్టి, కత్తెరతో పొడిచి అతన్ని చంపాడు.
Read Also: Hardik Pandya : టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డ్
ఆ తర్వాత నిందితుడు ఇలియాస్ ఇంటికి తిరిగి వచ్చి కొన్ని నిద్రమాత్రలు వేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతని తండ్రి కొడుకును గమనించి ఆసుపత్రికి తరలించారు. తన కొడుకు ఆత్మహత్యాయత్నం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. నిందితుడు సోమవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడని, కోర్టు ముందు హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. అనంతరం అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు వెస్ట్ డీసీపీ లక్ష్మణ్ నింబర్గి తెలిపారు.