మహా శివరాత్రి వేళ శైవ క్షేత్రాలు వేడుకలకు ముస్తాబవుతున్నాయి. హిందువుల ముఖ్యపండగల్లో మహాశివరాత్రి ఒకటి. శివయ్య భక్తులు పరమ శివున్ని భక్తి శ్రద్ధలతో కొలిచేందుకు రెడీ అవుతున్నారు. శివుడికి ప్రీతికరమైన మహాశివరాత్రి నాడు అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణ చేస్తారు. శివనామస్మరణతో తమ భక్తిని చాటుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చి, బాధలు తొలగించే శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు శివ పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి వేళ చాలా మంది ఉపవాసాలు, జాగారాలు చేస్తుంటారు. అయితే ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. కానీ, కొందరు ఉపవాసాలు, జాగారాలు చేయకపోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ మహాశివరాత్రి నాడు జాగరణ, ఉపవాసం ఎలాంటి వారు చేయకూడదు అంటే?
Also Read:Fibernet: ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య.. ఉత్తర్వులు జారీ
మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసేవారు శరీర శక్తి కోసం మితంగా పండ్లు, పాలు తీసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నాము అంటే పూర్తిగా మహా శివరాత్రి రోజు నిరాహారంగా ఉపవాసం చెయొచ్చు. అయితే అనారోగ్యంతో ఉన్న వారు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలు ఉపవాసం, జాగరణ చెయ్యకపోవడం ఉత్తమం. రోజంతా ఉపవాసంతో నీరసించిపోయే అవకాశం ఉంటుంది. నిద్ర లేకపోతే మరింత అలసటకు గురవుతారు. కాబట్టి వారంతా ఉపవాసాలు, జాగరణ చేయకపోవడమే బెటర్. ఇలాంటి వారు మహాశివరాత్రి రోజున శివనామ స్మరణ, ప్రవచనాలు వింటూ తమ భక్తిని చాటుకోవచ్చు. శివ నామ జపము, అభిషేకం, పూజలు, శ్లోకాలు, మంత్రాలు పఠిస్తూ మహాశివరాత్రిని జరుపుకోవచ్చు.