Assam: అస్సాంకు పెట్టుబడుల వరద పారింది. గౌహతిలో జరిగిన అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్‌లో వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. దేశంలో దిగ్గజ పారిశ్రామికవేత్తలుగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ అస్సాంలో ఒక్కొక్కరు రూ. 50,000 కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించారు. ఇద్దరు కలిసి రూ. 1 లక్ష కోట్లను అస్సాంలో పెట్టుబడిగా పెట్టనున్నారు.