Hurun rich list: హురన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులు అమెరికాలోని న్యూయార్క్‌లోనే నివసిస్తున్నారు. అయితే, ఆసియాలో మాత్రం బిలియనీర్లకు కేంద్రంగా ముంబై తొలిస్థానంలో ఉంది. చైనా రాజధాని బీజింగ్‌ని వెనక్కి నెట్టి ముంబై ఈ ఘనత సాధించింది. 119 మంది బిలియనీర్లలో న్యూయార్క్ మొదటిస్థానంలో ఉండగా.. 97 మందితో లండన్ రెండో స్థానంలో నిలిచింది. ముంబైలో 92 మంది, బీజింగ్‌లో 91 మంది, షాంఘైలో 87 మంది బిలియన్లు ఉన్నట్లు హూరన్ జాబితా వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 3279 బిలియన్లు ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి వారి సంఖ్య 5 శాతం పెరిగింది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా చైనాలో ఎక్కువ మంది బిలియనీర్ల ఉన్నట్లు నివేదిక తెలిపింది. చైనాలో 814 మంది బిలియనీర్లు ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 155 తగ్గారని తెలిపింది. అమెరికాలో 800 మంది బిలియనీర్ల ఉండగా.. వీటి తర్వాత మూడో స్థానంలో ఇండియా 271 మంది బిలియనీర్లతో ఉంది. సంపద సృష్టిలో చైనాలో ఇటీవల కాలంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని, రియల్ ఎస్టేట్‌తో పాటు పలు రంగాల్లో ఒడిదుడుకులు చైనాలో బిలియనీర్ల సంఖ్య తగ్గుదలకు కారణమైందని నివేదిక తెలిపింది. నోంగ్‌ఫు స్ప్రింగ్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ జాంగ్ షన్షాన్ చైనా యొక్క అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగుతుండగా… పిండువోడువో వ్యవస్థాపకుడు కొలిన్ హువాంగ్, టెన్సెంట్ CEO మా హువాటెంగ్‌ను అధిగమించి రెండవ స్థానానికి చేరుకున్నారు.
Read Also: Inspector Rishi: దెయ్యం రోజూ నా బెడ్ రూమ్ కొచ్చేది.. నవీన్ చంద్ర షాకింగ్ కామెంట్స్
ఇక అమెరికాలో అత్యంత సంపన్న వ్యక్తుల పెరుగుదలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కీలక పాత్ర పోషించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఒరాకిల్ మరియు మెటా వంటి కంపెనీల వెనుక ఉన్న బిలియనీర్లు AIపై పెట్టుబడులు పెట్టడంతో సంపద గణనీయంగా పెరిగిందని నివేదిక హైలెట్ చేసింది. బ్లూమ్ బెర్గ్ బిలయనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బైజోస్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వరసగా మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
భారత్ విషయానికి వస్తే ఆల్ట్రా రిచ్ లిస్టులో కొత్తగా 84 మంది సభ్యులు వచ్చారు. అక్టోబర్-డిసెంబర్ కాలంలో జీడీపీ 8.4 వృద్ధితో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని నివేదిక తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ 110 బిలియన్ డాలర్ల నికర విలువతో ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా మరియు ప్రపంచవ్యాప్తంగా పదకొండవ అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు. అదానీ గ్రూప్ వ్యవస్థాపకులు గౌతమ్ అదానీ తర్వాతి స్థానంలో ఉన్నారు.