Weather Updates: భారత్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎండలతో సతమతం అవుతున్న ప్రజానీకానికి ఐఎండీ చల్లని కబురు అందించింది. భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం చేశాయని ఐఎండీ తాజాగా వెల్లడించింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించినట్లు వివరించింది. అంతేకాకుండా బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయని తెలిపింది.
ఈ నేపథ్యంలో నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడుకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా కేరళను తాకనున్న రుతుపవనాలు జూన్ తొలివారంలో తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read
- Bihar: దారుణం.. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రేయసిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
- Delhi: జంతర్‌మంతర్ దగ్గర ధర్నాకు పోలీసుల ప్లాన్.. దేనికోసమంటే..!
- Uttar Pradesh: ఫాలోవర్ల కోసం ఎంతకు తెగించారు.. ఒకే వ్యక్తి ముగ్గురు అక్కాచెల్లెళ్ల పెళ్లిలో ట్విస్ట్..
- Narendra Modi: ఇది కదా మోడీ క్రేజ్.. Gen Z వీడియోలతో 10.5 కోట్లు దాటిన ఫాలోవర్స్..
మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బాలాజీ జిల్లా చంద్రగిరిలో భారీగా ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. దీంతో కాల్వలు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అటు ఏపీ సరిహద్దు తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరిలో భారీ వర్షం పడుతోంది. 64వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
తాజావార్తలు
-
Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
-
Heavy Rain Alert: కాసేపట్లో హైదరాబాద్‌లో కుండపోత.. అత్యవసరమైతేనే బయటకు రండి.!
-
Bihar: దారుణం.. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రేయసిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
-
PoK Protest: పీఓకేలో పాక్ సైన్యం అరాచకం.. కాల్పుల్లో 20 మంది ఉద్యమకారులు మృతి..
-
CM Revanth Reddy : ఏపీలో రూ.10 వేల కోట్ల బకాయిలు.. అక్కడ ఎందుకు ప్రశ్నించరు.?
ట్రెండింగ్
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!