Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
- కాంగో విమాన ప్రమాదం
- సాంకేతిక లోపంతో కెన్గేలో కూలిన విమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congo Plane Crash: కాంగోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విమానం కూలిపోవడంతో ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కాంగో సైన్యం శుక్రవారం వెల్లడించింది. మృతుల్లో మిలిటరీ కోర్టు అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటలాయి టియెండే, సాయుధ దళాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా ఉన్నారు. వీరితో పాటు ప్రతినిధి బృందంలోని 12 మంది, విమాన సిబ్బంది కూడా ప్రమాదంలో మృతి చెందినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.
కిక్విట్ నుంచి కిన్షాసాకు తిరుగు ప్రయాణంలో ప్రమాదం
స్థానిక అధికారుల వివరాల ప్రకారం.. ఈ విమానం నైరుతి ప్రాంతంలోని కిక్విట్ నుంచి రాజధాని కిన్షాసాకు తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం అదుపుతప్పి కెన్గే ప్రాంతంలో కూలిపోయింది. విమానంలో ఉన్న వారంతా ఈ ప్రమాదంలో మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కాంగో సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమి ఎకెంగే మాట్లాడుతూ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ బోర్డు చైర్మన్ ట్రైఫోన్ కిన్-కియే ములుంబా కూడా ప్రమాదానికి కారణం ఇప్పటివరకు తెలియలేదని తెలిపారు.
Also Read
- Canadian Military: కెనడా మిలిటరీ శిక్షణలో తీవ్ర విషాదం.. నలుగురు సైనికులు మృతి, 39 మందికి గాయాలు
- Israel: ఇజ్రాయెల్-వియన్నా విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ కోడ్‌తో అలర్ట్
- Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
- Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
తిరుగుబాటు గ్రూపులతో పోరాడుతున్న కాంగో సైన్యం
కాంగోలో కొంతకాలంగా సైనిక పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ముఖ్యంగా దేశంలోని తూర్పు ప్రాంతంలో పలు తిరుగుబాటు గ్రూపులతో కాంగో సైన్యం పోరాడుతోంది. రువాండా మద్దతు ఉందని కాంగో ప్రభుత్వం ఆరోపించే M23 తిరుగుబాటు గ్రూప్ సహా పలు సాయుధ సంస్థలు గత ఏడాది నుంచి దాడులను తీవ్రతరం చేశాయి. ఈ దాడుల కారణంగా కొన్ని కీలక నగరాలు తిరుగుబాటు గ్రూపుల ఆధీనంలోకి వెళ్లినట్లు సమాచారం.
జర్మనీలో అమెరికా సైనిక విమానం కూడా ప్రమాదం
ఇదిలా ఉండగా, ఈ వారంలో జర్మనీలోని అమెరికా సైనిక స్థావరంలో మరో విమాన ప్రమాదం జరిగింది. మంగళవారం పశ్చిమ జర్మనీలోని స్పాంగ్డాలెమ్ ఎయిర్‌బేస్‌లో అమెరికా సైనిక విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమాన పైలట్ ఎజెక్ట్ అయ్యి ప్రాణాలతో బయటపడ్డారని అమెరికా సైన్యం తెలిపింది. గాయపడిన పైలట్‌కు వైద్య చికిత్స అందించినట్లు వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక, అత్యవసర సేవల బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా సైనిక అధికారులు వెల్లడించలేదు.
స్పాంగ్డాలెమ్ ఎయిర్‌బేస్‌లో సుమారు 20 F-16 యుద్ధ విమానాలతో కూడిన స్క్వాడ్రన్ ఉంది. అమెరికా వైమానిక దళం, NATO కార్యకలాపాలకు ఈ స్థావరం కీలకంగా పనిచేస్తోంది. అక్కడ సుమారు 5,000 మంది సైనిక, పౌర ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. కాంగోలో జరిగిన తాజా ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో విమాన ప్రమాదానికి దారితీసిన సాంకేతిక లోపం, ఇతర కారణాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
DR Congo🇨🇩: Plane crash in Kenge, Kwango province #RDC #KWANGO #avion pic.twitter.com/5aYI86rqbz
— marknehpets (@mapkpets) September 25, 2026
తాజావార్తలు
-
Surya Kumar Yadav: టీమిండియా నుంచి డ్రాప్.. ఆ టోర్నీలో సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్..
-
CM Devendra Fadnavis: “నిందితులను వదిలిపెట్టం”.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనపై సీఎం ఫడ్నవీస్ ఫైర్..
-
Tiger Shroff Shooting: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. దీపావళి టపాసులు అనుకున్నాం..!
-
Bengaluru Lawyer Murder: దారుణం.. అద్దె డబ్బుల వివాదంతో లాయర్ హత్య! కాల్పులు జరిపి పరారైన ఇద్దరు అద్దెదారులు
-
WCL 2026 Winner: రెచ్చిపోయిన బ్రావో, వాల్టన్, సిమ్మన్స్.. డబ్ల్యూసీఎల్ టైటిల్ విజేతగా వెస్టిండీస్!
ట్రెండింగ్
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!