Assam Floods: అస్సాంలో భారీ వరదలు… ఆరు జిల్లాలపై ఎఫెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అకాల వర్షాలు అస్సాంను ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల అస్సాంలోని 6 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వర్షాల వల్ల మెరుపు వరదలు సంభవించాయి. వాగులు, నదులు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరుగిపడుతున్నాయి. ఈ ఏడాదిలో తొలిసారి అస్సాంను వరదలు ముంచెత్తాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నిన్న డిమా హసావో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. డిమా హసావో జిల్లాలోని 12 గ్రామాల్లో కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. హప్లాంగ్ ప్రాంతంలో దాదాపుగా 80 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దిమా హసావో జిల్లాలో కొండచరియలు విరిగిపడటం వల్ల ఒక మహిళ సహా ముగ్గురు మరణించినట్లు అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది.
అస్సాంలో ఇప్పటి వరకు కాచర్, దేమాజీ, హోజాయ్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, నాగావ్, కమ్రూప్ ఈ ఆరు జిల్లాలు వరదల వల్ల ప్రభావితం అయ్యాయి. ఆరు జిల్లాల్లోని 94 గ్రామాలకు చెందిన 24,681 మంది ప్రభావితం అయ్యారు. ఒక్క కాచర్ జిల్లాలోనే 21,000 మంది వరద బారిన పడ్డారు. హోజాయ్, వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ జిల్లాను కలిపే రహదారి వరదల్లో కొట్టుకుపోయింది.
Also Read
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
అస్సాంతో పాటు సమీపంలో ఉండే అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ జిల్లాల్లో కూడా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. పలు నదులు ప్రమాద తీవ్రతను మించి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కొపిలి నది నది ప్రవాహ తీవ్రత ప్రమాద స్థాయిని దాటింది. ఆర్మీ, పార మిలటరీ, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ ఎమర్జెన్సీ టీములు రెస్క్యూను కొనసాగిస్తున్నాయి. శనివారం కాచర్ జిల్లాలో 2150 మందిని రెస్క్యూ చేశాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, కరెంట్ పోల్స్ కొట్టుకుపోయాయి.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!