Modi-Trump: ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్.. 40 నిమిషాల పాటు సంభాషణ..
- ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్..
- 40 నిమిషాల పాటు సంభాషణ..
- ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి గురించి చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi-Trump: ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మంగళవారం 40 నిమిషాల పాటు టెలిఫోన్ సంభాషణ జరిగింది. అమెరికా-ఇరాన్ కాల్పులు విరమణ తర్వాత ఇద్దరు నాయకుల ఇదే మొదటిసారి మాట్లాడుకోవడం. ట్రంప్‌తో మాట్లాడిన వివరాలను ప్రధాని మోడీ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ‘‘ నా మిత్రుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని సమీక్షించాము. అన్ని రంగాల్లో మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాము. పశ్చిమాసియా పరిస్థితి గురించి చర్చించాము. హార్ముజ్ జలసంధిని తెరిచి, సురక్షితంగా ఉంచాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పాము’’ అని పేర్కొన్నారు.
Read Also: Suspended: ఆ పని చేసినందుకు ముగ్గురు పంచాయతీ కార్యదర్శులపై వేటు.. సస్పెండ్ చేసిన కలెక్టర్..
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
ఈ ఫోన్ కాల్ సందర్భంగా ఇరాన్ యుద్ధం, వాణిజ్యంపై చర్చించినట్లు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. భారత్, అమెరికాల మధ్య పటిష్టమైన సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక బంధం మరింత బలపడగలదని, రాబోయే కొద్ది రోజుల్లో భారత్ అమెరికాల మద్య ఇంధనంతో పాటు కొన్ని అతిపెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని ఆయన అన్నారు. అమెరికా భారతదేశాన్ని ఎంతో ప్రేమిస్తుందని ట్రంప్ మోడీతో అన్నారని గోర్ తెలిపారు.
ఇటీవల పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో యూఎస్-ఇరాన్ మధ్య 21 గంటల పాటు శాంతిచర్చలు జరిగాయి. అయితే, ఈ చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ముగిశాయి. చర్చలు విఫలమైనట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. చర్చలు విఫలమైన తర్వాత హార్ముజ్ జలసంధిని దిగ్భంధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
Received a call from my friend President Donald Trump. We reviewed the substantial progress achieved in our bilateral cooperation in various sectors. We are committed to further strengthening our Comprehensive Global Strategic Partnership in all areas. We also discussed the…
— Narendra Modi (@narendramodi) April 14, 2026
తాజావార్తలు
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
-
Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
-
Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
-
SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
-
Yash : యష్ రిస్క్ చేస్తున్నాడా? బయట పడలేకపోతున్నాడా?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!