Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా “సరిపోదా శనివారం”. ‘అంటే సుందరానికీ’ తర్వాత ఈ నాని, వివేక్ నుంచి వస్తున్న రెండో చిత్రం ఇది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Also Read; Kalki Collections : బాక్సాఫీస్‌కా బాస్… ఓన్లీ ప్రభాస్
డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై పాన్ ఇండియా మూవీగా డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. యాక్షన్-అడ్వెంచర్ గ తెరకెక్కుతున్న ఈ మూవీ లో ఎస్‌జే సూర్య, సాయికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో ప్రియాంక మోహన్ చారులత అనే ఇన్నోసెంట్ కానిస్టేబుల్ గ కనిపిస్తోంది. ఖాకీ దుస్తులు ధరించి, భుజంపై బ్యాగ్‌తో అందమైన చిరునవ్వు ఆమె కనిపించింది. ఇక అలానే సినిమాలో ప్రియాంక పాత్ర చాలా కీలకంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.. ఈ సినిమాకు మురళి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.
Charu….❤️🔥❤️🔥#SaripodhaaSanivaaram pic.twitter.com/dCKwwGgHJ7
— DVV Entertainment (@DVVMovies) July 7, 2024