భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో బాలిక, బాలుడి మృతదేహాలు తీవ్ర కలకలం రేపాయి. రాజస్థా్న్‌లోని జైసల్మేర్‌లోని ఇండో-పాక్ సరిహద్దులో కుళ్లిపోయి ఉన్న రెండు మృతదేహాలను బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకుంది. సంఘటనాస్థలి నుంచి ఖాళీ వాటర్ బాటిల్, ఐడీలు, సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఐడీకార్డులను బట్టి పాకిస్థాన్ జాతీయులుగా అధికారులు గుర్తించారు. భారత్ నుంచి పాకిస్థాన్‌కు వెళ్తున్నారా? లేదంటే పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తు్న్నారా? అనేది ఇంకా తేలలేదు. తాజాగా వర్షాలు కురవడంతో పాదముద్రలు గానీ.. ఆనవాళ్లు గానీ ఏమీ కనిపించలేదు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Patancheru : పాశమైలారం పేలుడు ఘటన.. 10కి చేరిన మృతుల సంఖ్య
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… భారత భూభాగంలో మృతదేహాలు కనిపించాయని చెప్పారు. పాకిస్థాన్ సిమ్ కార్డు, ఐడీలు, మొబైల్ ఫోన్, వాటర్ బాటిల్ సంఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకున్నారు. డీహైడ్రేషన్ కారణంగానే ఇద్దరూ చనిపోయి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారనేది తేలాల్సి ఉందని చెప్పారు. ఇద్దరు మృతదేహాలు కూడా కుళ్లిపోయి ఉన్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Rukmini Vasanth : రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే..
భారత భూభాగం నుంచి 10-12 కిలోమీటర్ల దూరంలో ఈ రెండు డెడ్‌బాడీలు కనిపించాయని.. ఐడీ కార్డులను బట్టి మృతులు రవి కుమార్(17), శాంతి బాయి(15)గా గుర్తించినట్లు జైసల్మేర్ ఎస్పీ సుధీర్ చౌదరి వెల్లడించారు. 2023లో జారీ చేయబడిన ఐడీ కార్డులు అని తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని.. ఆధారాలు నిర్ధారించేందుకు ప్రయత్నిస్తు్న్నట్లు పేర్కొన్నారు. వారం క్రితం చనిపోయి ఉంటారని అంచనా వేశారు. మృతదేహాలను రామ్‌గఢ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చురీకి పంపారు. పోస్ట్‌మార్టం పరీక్ష తర్వాత మరణానికి కారణాన్ని నిర్ధారించనున్నారు.
#WATCH | Jaisalmer, Rajasthan | On dead bodies of Pakistani nationals found near India-Pakistan border, SP Sudhir Chaudhary says, "Around 11 AM yesterday, a local resident reported that the body of a young woman had been found a few kilometres from the international… pic.twitter.com/tYQ3ZOonIy
— ANI (@ANI) June 29, 2025