Meta: భారతదేశంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో బిజినెస్ కోసం టెక్ దిగ్గజం మెటా వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ని ఈరోజు ప్రవేశపెట్టింది. గత సంవత్సరం పరిమిత వినియోగదారులతో సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను పరీక్షించిన తర్వాత, మరిన్ని ఫీచర్లు, సపోర్ట్‌తో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మెటా వెరిఫైడ్ బిజినెస్ ఆఫర్‌ను విస్తరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వ్యాపారాల కోసం వెరిఫై చేయబడిన వారికి మెటా వెరిఫై బ్యాడ్జ్, మెరుగైన అకౌంట్ సపోర్ట్ అందిస్తుంది. మెరుగైన రక్షణతో పాటు అదనపు ఫీచర్లను అందించనుంది. ఈ ప్లాన్ నెలకు ఒక యాప్‌కి రూ. 639 నుంచి ప్రారంభమవుతుంది. ఇది రూ. 21,000 వరకు ఉంటుంది. ఇది రెండు యాప్‌లకు సంబంధించి ఒక నెలకు ప్రారంభ డిస్కౌంట్ రేట్ అని కంపెనీ వెల్లడించింది.
Read Also: Siddaramaiah:100 శాతం రిజర్వేషన్ పై విమర్శలు..బిల్లును తాత్కాలికంగా నిలిపిన ప్రభుత్వం
అంతేకాకుండా, వివిధ సంస్థలు తమ అవసరాలకు సరిపోయే మెంబర్‌షిప్ ప్యాకేజీని ఎంచుకోవడంలో సహాయపడటానికి మెటా వెరిఫైడ్ నాలుగు విభిన్న ప్లాన్లను అందిస్తోంది. ఇండియన్ యూజర్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్లను ఐఓఎస్, ఆండ్రాయిడ్ అధికారిక స్టోర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయడానికి వీలుంది. ఇండియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా యొక్క వెరిఫైడ్ బిజినెస్ ఆఫర్ ఇప్పుడు సాధారణంగా ‘బ్లూ టిక్’ అని పిలువబడే వెరిఫైడ్ బ్యాడ్జ్‌ని కలిగి ఉంటుంది.
బిజినెస్ ఓనర్లు ఈ వెరిఫైడ్ బ్యాడ్జ్ ద్వారా ప్రయోజనం పొందుతారని, ఇది విశ్వసనీయతను మెరుగుపరుస్తుందని, కస్టమర్లలో వారి ఇంటరాక్షన్‌ని సహాయపడుతుందని, విశ్వాసాన్ని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మెటా వెరిఫైడ్ సబ్‌స్క్రైబర్ల కోసం సపోర్ట్ అందించనుంది. ఇదే కాకుండా వెరిఫై చేయబడిన బిజినెస్ సబ్‌స్క్రైబర్లు ప్లాన్లను పెంచుకున్నప్పుడు వారి రీల్స్‌లో మరిన్ని లింకులను యాడ్ చేసుకోవచ్చు. వివిధ మెటా ప్లాట్‌ఫారమ్‌లలో వారి ప్రొఫైల్‌ను మెరుగుపరచడానికి మరిన్ని ఫీచర్‌లకు యాక్సెస్ పొందవచ్చు.