Meerut: భర్త “గడ్డం” తీయనందుకు, మరిదితో లేచిపోయిన మహిళ..
- గడ్డం తీయనందుకు మరిదితో లేచిపోయిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meerut: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో ఓ విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. భర్త ‘‘గడ్డం’’ కారణంగా ఓ మహిళ లేచిపోయింది. గడ్డం షేవ్ చేసుకోవాలని పదే పదే మహిళ అభ్యర్థించినప్పటికీ భర్త అందుకు అంగీకరించలేదు. దీంతో సదరు మహిళ తన బావతో పారిపోయింది. మీరట్‌లోని ఉజ్జ్వాల్ గార్డెన్ కాలనీలో ఈ సంఘటన జరిగింది.
ముస్లిం మతాధికారి షకీర్ అనే వ్యక్తికి అర్షి అనే యువతితో 7 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత నుంచి భార్య అతడిని గడ్డం తీయాలని ఒత్తిడి చేసింది. ‘‘కుటుంబ ఒత్తిడితోనే నిన్ను వివాహం చేసుకున్నానని, గడ్డం తీస్తేనే కలిసి సంసారం చేస్తానని’’ అర్షి తనతో చెప్పినట్లు షకీర్ ఆరోపించాడు. దీనిపై అర్షి కుటుంబానికి షకీర్ ఫిర్యాదు చేశాడు.
Also Read
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
Read Also: YS Jagan: సింహాచలం ఘటన మృతుల కుటుంబాలకు జగన్ పరామర్శ.. ఇది ప్రభుత్వ వైఫల్యమే..!
ఇదే సమయంలో, అర్షి షకీర్ తమ్ముడితో రిలేషన్ ప్రారంభించింది. చివరకు వీరిద్దరు ఫిబ్రవరి 3న ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా షకీర్, అతడి కుటుంబం షాక్‌కి గురైంది. కుటుంబం పరువు పోతుందని షకీర్ తన బంధువుల సాయంతో వారిని కనుగొనే ప్రయత్నం చేశాడు, కానీ వారిద్దరి ఆచూకీ లభించలేదు.
చివరకు షకీర్ తన భార్య, తమ్ముడిపై మిస్సింగ్ కంప్లైట్ దాఖలు చేశాడు. అర్షి కుటుంబానికి కూడా లేచిపోయిందనే సమాచారాన్ని ఇచ్చాడు. అయితే, కుటుంబం జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. కుటుంబం అర్షితో అన్ని సంబంధాలను తెంచుకున్నట్లు చెప్పింది. అర్షి తనను రూ. 5 లక్షలు డిమాండ్ చేస్తుందని షకీర్ ఆరోపించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ ఆయుష్ విక్రమ్ ధృవీకరించారు.
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?