India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Retail Inflation Rises: మార్కెట్లో ఏ వస్తువు కొనబోయినా.. ధరలు భగ్గుమంటున్నాయి.. ఈ నేపథ్యంలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరోసారి పెరిగింది. ఆహార పదార్థాల ధరలు పెరగడంతో సెప్టెంబర్‌లో వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.54 శాతానికి చేరింది. ఆగస్టు నెలలో ఇది 4.83 శాతంగా నమోదైంది. దీంతో నెల వ్యవధిలో ద్రవ్యోల్బణం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) పరిధిలోని జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) విడుదల చేసిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌లో గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.08 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 4.88 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం అధికంగా నమోదైంది.
జనవరిలో విడుదల చేసిన కొత్త సూచీ సిరీస్‌లో సెప్టెంబర్ ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయికి చేరినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరల పెరుగుదల మొత్తం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. నిత్యావసర వస్తువుల ధరల్లో మార్పులు సామాన్య కుటుంబాల నెలవారీ ఖర్చులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆగస్టులో 4.83 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5.54 శాతానికి పెరగడం ధరల పరిస్థితిపై మరోసారి దృష్టి సారించేలా చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నమోదైన గణాంకాలు దేశవ్యాప్తంగా జీవన వ్యయంపై ఆహార ధరల ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి.
Also Read
- Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
తాజావార్తలు
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!