DMK: స్టాలిన్‌కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్‌బై
- తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం..
- డీఎంకే కూటమికి గుడ్‌బై చెప్పిన ఎండీఎంకే..
- 9 ఏళ్ల స్నేహాన్ని తెంచుకున్న వైకో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK: తమిళనాడులో రాజకీయాల్లో కీలక పరిణామం ఎదురైంది. మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిదేళ్లుగా డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న వైకో నేతృత్వంలోని ఎండీఎంకే, తాము కూటమి నుంచి బయటకు వెళ్తున్నట్లు ప్రకటించింది. పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డీఎంకేలో కొనసాగడం సాధ్యం కావడం లేదని, తమ పార్టీని బలహీనపరిచే కుట్ర చేస్తోందని ఎండీఎంకే ఆరోపించింది. ఇదే కాకుండా, అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చేలా రహస్య ప్రణాళిక అమలు చేస్తున్న పరిస్థితుల్లో డీఎంకేతో కొనసాగలేమని చెప్పింది.
ఇదిలా ఉంటే, తమిళనాడులో అధికారంలో ఉన్న సీఎం విజయ్‌కు చెందిన టీవీకే పార్టీతో జత కడుతున్నట్లు ఎండీఎంకే చెప్పలేదు. కానీ ఇటీవల, ఫ్లోర్ టెస్ట్ సందర్భంలో ఎండీఎంకే పార్టీ సభ్యులు గైర్హాజరయ్యారు. దీనిని బట్టి చూస్తే పరోక్షంగా టీవీకేకు సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల సీఎం విజయ్‌తో వైకో, ఆయన కుమారుడు దురై వైకో భేటీ అవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎండీఎంకే అధినేత వైకో ఒకప్పుడు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధికి అత్యంత సన్నిహితుడు. 1993లో డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తర్వాత, పలుమార్లు డీఎంకేతో పొత్తు కలుస్తూ, విడిపోతూ ఉన్నాడు. ఇప్పుడు మరోసారి డీఎంకేతో స్నేహానికి గుడ్ బై చెప్పారు.
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్‌డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్‌పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
- Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
ఇదిలా ఉంటే, ఈ మొత్తం పరిణామంలో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఎండీఎంకేకు అసెంబ్లీలో ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిద్దరు కూడా డీఎంకే గుర్తుపై గెలిచారు. ఎండీఎంకే కూటమి నుంచి వెళ్లిపోయినప్పటికీ, ఎమ్మెల్యేలు మాత్రం డీఎంకేతోనే ఉంటామని స్పష్టం చేశారు. ఇటీవల వీరిద్దరు ఎండీఎంకే పార్టీ సమావేశానికి కూడా హాజరుకాలేదు. దీంతో ఒక వేళ టీవీకేతో జత కట్టినా, ఇప్పటికిప్పుడు విజయ్ ప్రభుత్వానికి సంఖ్యా బలం పెరిగే అవకాశం లేదు. ఇప్పటికే కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, ఎండీఎంకే పార్టీలు అధికార టీవీకే కూటమికి దగ్గరయ్యాయి. ఒకప్పుడు వీరంతా డీఎంకే కూటమిలో సభ్యులుగా ఉండే వారు.
తాజావార్తలు
-
DMK: స్టాలిన్‌కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్‌బై
-
Trisha: ‘తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..’ పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..