Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salary Hike 2026-27: జీతాలు పెరగక చాలా రంగాల్లో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. మరికొన్ని రంగాలను ఉద్యోగాల తొలగింపు భయం వెంటాడుతుంది.. ఇక, మరికొన్ని రంగాల్లో ఉద్యోగాలను AI దెబ్బకొడుతుంది.. అయితే, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారత్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీతాలు సగటున 9.1 శాతం పెరిగే అవకాశం ఉందని గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఏఆన్ (Aon) తన వార్షిక సర్వేలో వెల్లడించింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), ఇంధన రంగం, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు అధిక వేతన పెంపు లభించే అవకాశం ఉందని అంచనా వేసింది. 45 పరిశ్రమలకు చెందిన 1,200కు పైగా కంపెనీల సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది.
ఎన్బీఎఫ్సీ రంగంలో అత్యధిక జీతాల పెంపు
2026-27లో ఎన్బీఎఫ్సీ రంగంలో ఉద్యోగుల జీతాలు 10.1 శాతం పెరిగే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఈ జాబితాలో ఇంధన రంగం 9.9 శాతం పెంపుతో రెండో స్థానంలో ఉండగా, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాల్లో 9.8 శాతం వేతన పెంపు ఉండొచ్చని తెలిపింది. ప్రతిభావంతులైన ఉద్యోగులను ఆకర్షించడం, కొనసాగించడం కోసం కంపెనీలు పెట్టుబడులు పెడుతూనే ఖర్చులను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయని నివేదిక సూచించింది.
Also Read
- GST Registration: వ్యాపారులకు కేంద్రం ఊరట.. ఇక క్షణాల్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు..
- Space X Shares: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. పిల్లలకూ స్పేస్ ఎక్స్ షేర్లు ఇస్తాం..
- Nvidia: ఎన్విడియాలో మరో సంచలన ప్రేమకథ.. చైనా లింక్ ఉన్న సంస్థ ఎగ్జిక్యూటివ్‌తో సీఈఓ సన్నిహితుడి రహస్య వివాహం..?
- National Stock Exchange: భారత్‌కు మరో ఘనత.. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్గా రికార్డు..
దేశీయ వినియోగం, పెట్టుబడులతో కంపెనీల్లో విశ్వాసం
భారత్‌లో దేశీయ వినియోగం బలంగా ఉండటం, పెట్టుబడులు కొనసాగడం, ఎగుమతులు మెరుగుపడటం వంటి అంశాలు కంపెనీల వ్యాపార విశ్వాసాన్ని పెంచుతున్నాయని ఏఆన్ ఇండియా టాలెంట్ సొల్యూషన్స్ విభాగం అధిపతి, భాగస్వామి రూపాంక్ చౌదరి తెలిపారు. ఈ పరిస్థితులు ఉద్యోగుల్లో ప్రతిభను పెంపొందించేందుకు కంపెనీలకు తోడ్పడుతున్నాయని, అదే సమయంలో నిర్వహణ ఖర్చులను అదుపులో ఉంచేందుకు అవకాశం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.
ఉద్యోగుల వలసలు 18 శాతానికి పెరుగుదల
జీతాల పెంపు అంచనాలు స్థిరంగా ఉన్నప్పటికీ, నైపుణ్యం కలిగిన ఉద్యోగులను సంస్థల్లో కొనసాగించడం కంపెనీలకు సవాలుగా మారుతోంది. 2026లో ఉద్యోగుల వలసల రేటు 18 శాతానికి పెరిగినట్లు ఏఆన్ సర్వే వెల్లడించింది. 2025లో ఇది 16.2 శాతంగా, 2024లో 17.1 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలు ప్రతిభావంతులైన ఉద్యోగుల కోసం కంపెనీల మధ్య పోటీ కొనసాగుతోందని సూచిస్తున్నాయి.
కంపెనీల్లో పెరుగుతున్న ఏఐ వినియోగం
కార్పొరేట్ రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం వేగంగా పెరుగుతోందని సర్వే తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పాదకత సాధనాలను క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్న కంపెనీల శాతం 2025లో 46.1 శాతంగా ఉండగా, 2026లో 56 శాతానికి చేరింది. దాదాపు 60 శాతం కంపెనీలు ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్పడంపై దృష్టి సారిస్తున్నాయి. ఏజెంటిక్ ఏఐ వినియోగం, ఏఐ సంబంధిత నైపుణ్యాలకు డిమాండ్ కూడా పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది.
ఏఐ, మెషిన్ లెర్నింగ్ నిపుణులకు అధిక వేతనాలు
ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్‌లో నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు భారతీయ కంపెనీలు 2025తో పోలిస్తే సుమారు 10 శాతం అధిక వేతనాలు చెల్లిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. వ్యాపార కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని విస్తరించడంతో పాటు ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడంపై సంస్థలు పెట్టుబడులు పెంచుతున్నాయని ఈ వివరాలు సూచిస్తున్నాయి.
కొత్త వేతన నియమావళి అమలుపైనా వివరాలు
కొత్త వేతన నియమావళి నిబంధనలను 65.4 శాతం కంపెనీలు ఇప్పటికే అమలు చేస్తున్నట్లు సర్వే పేర్కొంది. మరో 20.9 శాతం కంపెనీలు వచ్చే ఆరు నెలల్లో ఈ నిబంధనలను అమలు చేయాలని భావిస్తున్నాయి. మొత్తంగా 2026-27లో జీతాల పెంపు సగటున 9.1 శాతంగా ఉండొచ్చని అంచనా ఉన్నప్పటికీ, ఏ రంగంలో పనిచేస్తున్నారు, ఉద్యోగికి ఉన్న నైపుణ్యాలు, కంపెనీ పరిస్థితులు వంటి అంశాలు వాస్తవ వేతన పెంపుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
GST Registration: వ్యాపారులకు కేంద్రం ఊరట.. ఇక క్షణాల్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు..
-
IBM: H-1B వీసాదారులకు IBM షాక్.. అమెరికా వదిలి వెళ్లండి లేదా ఉద్యోగం మానేయండి!
-
Adarsha Kutumbam OTT Release: ఓటీటీలోకి వెంకీ మామ మాస్ జాతర.. రేపటి నుంచే ‘ఆదర్శ కుటుంబం’ సందడి!
-
Supreme Court: జంక్ ఫుడ్‌పై సుప్రీం కొరడా.. ప్యాకెట్లపై ఇకపై విడివిడిగా ‘హై ఫ్యాట్, షుగర్, సాల్ట్’ హెచ్చరికలు..
-
Tollywood: ఇంటర్వెల్ వరకు కాలర్ ఎగరేస్తే.. క్లైమాక్స్‌కు తల పట్టుకుంటున్నారు!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!