ప్రస్తుతం దేశంలో మావోల ఏరివేత కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు తమ ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోని మావోయిస్టులను మాత్రం భద్రతా దళాలు అంతమొందిస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టుల హెచ్చరిక లేఖ కలకలం సృష్టిస్తోంది. చర్లలో భూస్వాములు, రాజకీయ నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట లేఖ విడుదల అయింది. లేఖ రిలీజ్ కావడంతో మండలంలోని భూస్వాముల్లో, అధికార పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది. పరుచూరి ప్రేమ్చంద్, పరుచూరి రవికుమార్, జవ్వాది రవికుమార్,…
Maoist's Letter: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఈ ఎన్ కౌంటర్ జరిగిందని అందులో పేర్కొన్నారు. నంబాల గత 6 నెలలుగా మాడ్ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసని చెప్పారు.
Maoists Letter: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం భూములపై మావోయిస్టులు లేఖ విడుదల కలంకలం రేపుతుంది. 600 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాలు చేసి ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టులు లేఖను విడుదల చేశారు.
వరంగల్ జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతుంది. మేడేను పురస్కరించుకొని మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఈ లేఖను విడుదల చేసింది. సామ్రాజ్యవాదాన్ని కూల్చి సోషలిజాన్ని నిర్మిద్దామని మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు.
Maoists Letter : ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు అమరులైన సంగతి తెలిసిందే. సుక్మా జిల్లాలోని జాగర్‌గూడ అటవీప్రాంతంలో శనివారం డీఆర్జీ పోలీసులు గాలింపు చేపడుతుండగా నక్సలైట్లు మెరుపుదాడికి దిగారు.
ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన ఉద్రికత్తలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఆందోళన కారులను అదుపుచేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. అయితే.. తాజాగా.. సికింద్రాబాద్ కాల్పులను మావోయిస్టు పార్టీ ఖండించింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. అగ్నిపథ్ పథకాన్ని రద్ధు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కాల్పుల్లో పాల్గొన్న పోలీసులపై హత్య నేరం కింద కేసులు నమోదు చేయాలని లేఖలో…
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో లేఖ విడదలైంది.. మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలకు ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించిన మావోయిస్టులు.. జీకే వీధి మండలం చాపరాతి పాలెంలో జరుగుతున్న మైనింగ్‌ను తరిమి కొట్టాలని పేర్కొన్నారు.. పార్టీలకు పదవులకు రాజీనామా చేసి మన్యం విడిచిపోవాలని హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో…