Maoist's Letter: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఈ ఎన్ కౌంటర్ జరిగిందని అందులో పేర్కొన్నారు. నంబాల గత 6 నెలలుగా మాడ్ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసని చెప్పారు.