December 2026 Movie Releases: డిసెంబర్లో సినిమా జాతర.. ఏకంగా 15 మూవీస్ రిలీజ్.. పూర్తి లిస్ట్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
December 2026 Movie Releases: సంక్రాంతికి స్లాట్స్ అన్నీ నిండిపోవడంతో సినీ నిర్మాతలందరికీ డిసెంబర్ నెల ప్రధాన ప్రత్యామ్నాయంగా మారింది. దీంతో ఈ డిసెంబర్లో ఏకంగా 15 సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మొదట డిసెంబర్ 3న విడుదల కావాల్సిన ‘ఫౌజీ’ చిత్రం వాయిదా పడటంతో ఆ వారం పలు క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి.
డిసెంబర్ మొదటి వారంలో భాగంగా, డిసెంబర్ 4న హీరో నితిన్ నటిస్తున్న, నాని నిర్మిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ విడుదలవుతోంది. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు, ‘ఫౌజీ’ పోస్ట్‌పోన్ కావడంతో నాగచైతన్య హీరోగా భారీ బడ్జెట్, భారీ సెట్టింగ్స్‌తో తెరకెక్కిన ‘వృషకర్మ’ చిత్రాన్ని కూడా డిసెంబర్ 4నే విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దర్శకత్వంలో నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది.
Also Read
- 750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!
- Delimitation Bill: మోడీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. మూడింట రెండొంతుల మెజారిటీపై ధీమా..!
- Tomato Paratha Recipe: కాస్త పులుపు.. కాస్త కారంగా.. టమాటర్ పరాటా ఇలా చేసేయండి..
- DMK MPs Meeting: డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వ్యూహం ఏమిటి? నేడు స్టాలిన్ కీలక భేటీ
ఇక, డిసెంబర్ 11న నాలుగు చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. జాతీయ అవార్డు గెలుచుకున్న ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రాన్ని నిర్మించిన నిహారిక కొణిదెల, ఈసారి ‘పాకెట్ రాకెట్స్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంతో పాటు ‘ఇడుపుకాయితం’, ‘ఇంకా ఏమీ అనుకోలేదు’, ‘రాయవలస’ సినిమాలు కూడా అదే రోజు విడుదలవుతున్నాయి. అయితే.. డిసెంబర్ 18న మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన హాలీవుడ్ చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్ డే’తో పాటు అల్లరి నరేశ్ నటించిన ‘ఆల్కహాల్’ సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి.
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ చివరి వారంలోనూ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. డిసెంబర్ సెంటిమెంట్ అక్కినేని నాగార్జున కెరీర్‌కు ఎంతో ప్రత్యేకం. గతంలో ఆయన నటించిన ‘మన్మథుడు’, ‘మాస్’, ‘నేనున్నాను’, ‘కింగ్’ వంటి చిత్రాలు డిసెంబర్లో విడుదలై ఘనవిజయం సాధించాయి. అదే సెంటిమెంట్‌తో నాగార్జున తన 100వ సినిమా ‘కింగ్ 100’ను డిసెంబర్ 24న విడుదల చేస్తున్నారు.
అదే డిసెంబర్ 24న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘దాదా’ కూడా విడుదలవుతోంది. ఇటీవల షూటింగ్లో బాలకృష్ణ గాయపడటంతో క్రిస్మస్ రేసులో ఈ సినిమా ఉండకపోవచ్చనే ప్రచారం జరిగినప్పటికీ, డిసెంబర్ 24నే చిత్రాన్ని విడుదల చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న హిందీ చిత్రం ‘కింగ్’ కూడా డిసెంబర్ 24నే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలకు తెలుగులో మంచి వసూళ్లు రావడంతో ‘కింగ్’ను కూడా తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు. స్ట్రెయిట్ సినిమాల మధ్యే గట్టి పోటీ ఉండగా, డబ్బింగ్ చిత్రంగా వస్తున్న ‘కింగ్’ కూడా తెలుగు సినిమాలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
మరోవైపు, సీనియర్ హీరోల సినిమాలు వస్తున్నప్పటికీ యువ హీరో కిరణ్ అబ్బవరం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆయన తొలిసారి మెగాఫోన్ పట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘రియాలిటీ’ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. మొత్తానికి, వరుస సినిమాల విడుదలలతో ఈ డిసెంబర్ ప్రేక్షకులకు అసలైన సినిమా పండుగను తీసుకురానుంది.
తాజావార్తలు
-
December 2026 Movie Releases: డిసెంబర్లో సినిమా జాతర.. ఏకంగా 15 మూవీస్ రిలీజ్.. పూర్తి లిస్ట్ ఇదే..
-
750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!
-
Major Terror Plot Foiled in J&K: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం.. ముగ్గురు లష్కరే అనుచరుల అరెస్ట్..!
-
Delimitation Bill: మోడీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. మూడింట రెండొంతుల మెజారిటీపై ధీమా..!
-
Tomato Paratha Recipe: కాస్త పులుపు.. కాస్త కారంగా.. టమాటర్ పరాటా ఇలా చేసేయండి..
ట్రెండింగ్
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!