165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redmi TV A55 2027 Launched: షియోమీ (Xiaomi) మరో కొత్త స్మార్ట్ టీవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెడ్మి టీవీ A55 2027 లెవల్ 1 ఎనర్జీ ఎఫిషియెన్సీ ఎడిషన్ (Redmi TV A55 2027 Level 1 Energy Efficiency Edition) పేరుతో ఈ టీవీని చైనాలో విడుదల చేసింది. ముఖ్యంగా తక్కువ ధరలోనే 165Hz రిఫ్రెష్ రేట్ అందించడం ఈ టీవీ ప్రత్యేకత. ఈ కొత్త రెడ్మి టీవీలో డైరెక్ట్ లిట్ బ్యాక్‌లైట్‌తో కూడిన డిస్ప్లేను అందించారు. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 4K రిజల్యూషన్‌తో 60Hz MEMC మోషన్ కాంపెన్సేషన్ టెక్నాలజీని అందించారు.
పనితీరు విషయానికి వస్తే ఈ టీవీలో ఫైవ్ కోర్ A55 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి జతగా 1.5GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. కనెక్టివిటీ కోసం Wi-Fi 6, బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఉన్నాయి. పోర్టుల విషయానికి వస్తే రెండు HDMI 2.0 పోర్టులు, రెండు USB-A 2.0 పోర్టులు ఇచ్చారు. వీటితో పాటు AV, ఈథర్నెట్, S/PDIF కనెక్షన్లు కూడా ఉన్నాయి. ఆడియో కోసం రెండు 10W స్పీకర్లను అందించారు. ఇవి గరిష్టంగా ఒక్కొక్కటి 12W అవుట్‌పుట్‌ను అందించగలవు. మెరుగైన బాస్ సౌండ్ కోసం డ్యూయల్ బాస్ డక్ట్స్‌ను ఏర్పాటు చేశారు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే.. ఈ టీవీ Xiaomi HyperOS 4 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
Also Read
- HP OmniBook Ultra 16: డెవలపర్లు, క్రియేటర్ల కోసం.. HP పవర్ఫుల్ AI ల్యాప్‌టాప్ లాంచ్.. 128GB RAM, NVIDIA AI చిప్
- 25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
- BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
- Hisense Smart TV: భారత్‌లోకి 55, 65 ఇంచెస్ కొత్త 4K MiniLED టీవీలు.. 120Hz మోడ్, Dolby Atmos ఫీచర్లు.. ధర ఎంతంటే?
ఇందులో Xiao AI వాయిస్ అసిస్టెంట్‌ను కూడా అందించారు. దీని ద్వారా వాయిస్ కమాండ్లతో టీవీని కంట్రోల్ చేయవచ్చు. ప్రశ్నలు అడగడం, క్రీడా ఈవెంట్ల వివరాలు తెలుసుకోవడం వంటి సదుపాయాలు ఉన్నాయి. వీటితో పాటు స్క్రీన్ మిర్రరింగ్, రిమోట్ ప్లేబ్యాక్ కంట్రోల్స్, చిల్డ్రన్ మోడ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. Redmi TV A55 2027 Level 1 Energy Efficiency Edition ప్రస్తుతం చైనా మార్కెట్లో మాత్రమే విడుదలైంది. లాంచ్ ఆఫర్ ధర 1,599 యువాన్లు (సుమారు 240 డాలర్లు). సాధారణ ధర 1,999 యువాన్లు (సుమారు 300 డాలర్లు). దీనికి చైనాలో అత్యున్నత స్థాయి Level 1 ఎనర్జీ ఎఫిషియెన్సీ రేటింగ్ కూడా లభించింది. అయితే ఈ టీవీని భారత్‌తో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని షియోమీ ఇంకా వెల్లడించలేదు.
తాజావార్తలు
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Thiruparankundram Deepam Row: తిరుపరంకుండ్రం దీపం వివాదం.. ‘మురుగనుక్కు ఆరోగరా’ అంటూ ప్రధాని మోడీ పోస్ట్
-
Rohit Sharma: “సవాళ్లను స్వీకరించడానికి నేను రెడీ”.. ముంబై కెప్టెన్‌గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్…
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!