Delimitation Bill: మోడీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. మూడింట రెండొంతుల మెజారిటీపై ధీమా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delimitation Bill: గతంలో ఎదురైనా అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసుకునేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రతిపాదిత బిల్లులో కొన్ని మార్పులు చేసిన తర్వాత పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించగలమని కేంద్రం ధీమాతో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. ఈ నెల 30న ఉదయం 10 గంటలకు పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అన్ని పార్టీల ప్రతినిధులతో చర్చించి పార్లమెంట్లో చేపట్టాల్సిన శాసన కార్యక్రమాలను ఖరారు చేయనున్నారు. డిసెంబర్ 1న లోక్‌సభలో కీలక బిల్లులపై ఓటింగ్ జరిగే అవకాశం ఉందని, ఇందుకు ఐదు నుంచి ఆరు గంటల సమయం పట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు ప్రాధాన్యం
డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంతో పాటు పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం కేంద్రం ప్రతిపాదనల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఇందుకోసం రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు-2026కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే నారీ శక్తి వందన్ అధినియమ్ అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా ఆమోదించింది. నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ (రెండో సవరణ) బిల్లు-2026ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. సవరించిన ముసాయిదాలో నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలను చేర్చినట్లు సమాచారం. ప్రతిపాదిత బిల్లులోని సెక్షన్ 10 ప్రకారం లోక్‌సభలో ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి కేటాయించే స్థానాల సంఖ్యతో పాటు రాష్ట్రాల శాసనసభల మొత్తం స్థానాలను 50 శాతం పెంచాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుత 550 నుంచి 850కి పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ స్థానాల సంఖ్య పెరగనుంది.
Also Read
- DMK MPs Meeting: డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వ్యూహం ఏమిటి? నేడు స్టాలిన్ కీలక భేటీ
- Women's Reservation Bill History: మహిళా రిజర్వేషన్ చట్టం చరిత్ర.. 1996 నుంచి 2023 వరకు, 33 శాతం కోటా ఎలా సాధ్యమైంది?
- Thiruparankundram Deepam Row: తిరుపరంకుండ్రం దీపం వివాదం.. ‘మురుగనుక్కు ఆరోగరా’ అంటూ ప్రధాని మోడీ పోస్ట్
- Delimitation: లోక్‌సభలో సీట్లు పెరిగితే ఖర్చుల సంగతేంటి? పూర్తి లెక్కలివే!
2029 ఎన్నికల కంటే ముందే డీలిమిటేషన్ పూర్తి చేయాలని యోచన
2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రెండేళ్లలోనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ముగించాలని ప్రణాళిక రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న 2026 జనాభా లెక్కల ప్రక్రియతో సంబంధం లేకుండా డీలిమిటేషన్ చేపట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రాలకు లోక్‌సభ స్థానాల కేటాయింపు 1971 జనాభా లెక్కల ఆధారంగా కొనసాగుతోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రాల మధ్య స్థానాల పునఃసర్దుబాటుపై ప్రస్తుతం నిలుపుదల కొనసాగుతోంది. తాజాగా ప్రతిపాదించిన చట్ట సవరణల ద్వారా ఈ ప్రక్రియకు మార్గం సుగమం చేయాలని కేంద్రం భావిస్తోంది.
బిల్లుకు మూడింట రెండొంతుల మెజారిటీ ఎందుకు అవసరం?
డీలిమిటేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీ అవసరం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం, ప్రతి సభలో మొత్తం సభ్యుల మెజారిటితో పాటు ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మంది మద్దతు తప్పనిసరి. అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. బిల్లులో మార్పులు చేసిన తర్వాత అవసరమైన మెజారిటీ సాధించగలమని కేంద్రం విశ్వసిస్తున్నట్లు సమాచారం. 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలన్నది కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లుపై పార్లమెంట్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Delimitation Bill: మోడీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. మూడింట రెండొంతుల మెజారిటీపై ధీమా..!
-
Tomato Paratha Recipe: కాస్త పులుపు.. కాస్త కారంగా.. టమాటర్ పరాటా ఇలా చేసేయండి..
-
DMK MPs Meeting: డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వ్యూహం ఏమిటి? నేడు స్టాలిన్ కీలక భేటీ
-
HDFC Bank Alert: UPI పేమెంట్లు చేసేవారికి అలర్ట్.. HDFC బ్యాంక్ కొత్త రూల్.. జనవరి 1 నుంచి ఈ SMS అలర్ట్స్ బంద్..!
-
Women’s Reservation Bill History: మహిళా రిజర్వేషన్ చట్టం చరిత్ర.. 1996 నుంచి 2023 వరకు, 33 శాతం కోటా ఎలా సాధ్యమైంది?
ట్రెండింగ్
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!