Shah Rukh Khan-Kareena: పదిహేనేళ్ల తర్వాత షారుఖ్ – కరీనా కాంబో రిపీట్.. డ్యాన్స్ ఫ్లోర్‌ను దుమ్ములేపేసారుగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan-Kareena: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ మరోసారి తెరపై కలిసి సందడి చేస్తున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ హిట్ జంట మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షారుఖ్ నటిస్తున్న భారీ చిత్రం ‘కింగ్’ నుంచి విడుదలైన ‘డాడీ కూల్ (కింగ్ వెర్షన్)’ పాట ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటలో ఇద్దరూ తమ ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో డ్యాన్స్ ఫ్లోర్‌ను హోరెత్తించారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘డాడీ కూల్’ పాటకు కొత్త హంగులు జోడిస్తూ ఈ వెర్షన్‌ను రూపొందించారు. ఒరిజినల్ పాటలోని బీట్స్, రెట్రో మ్యూజిక్ స్టైల్‌ను కొనసాగిస్తూనే బాలీవుడ్ టచ్ ఇచ్చారు. షారుఖ్ తన స్టైలిష్ లుక్, క్లాసిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకోగా.. కరీనా తన గ్లామర్, ఎనర్జీతో మరోసారి మెస్మరైజ్ చేశారు. ఇద్దరి మధ్య కనిపించిన ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను అలరిస్తోంది. ఫ్రాంక్ ఫారియన్, జార్జ్ రేయమ్ రచించిన బోనీ ఎం ఒరిజినల్ పాట ఆధారంగా ‘డాడీ కూల్ (కింగ్ వెర్షన్)’ను సచిన్ జిగర్ స్వరపరిచారు. ప్రముఖ గాయకులు అరిజిత్ సింగ్, శిల్పా రావు తమ గాత్రాన్ని అందించారు. జాతీయ అవార్డు గ్రహీత కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. కుమార్ హిందీ సాహిత్యాన్ని రాశారు.
Also Read
- Natural Star Nani: యాక్షన్‌కు నాని గుడ్‌బై? మళ్లీ ఫ్యామిలీ కథల వైపు నేచురల్ స్టార్!
- 200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
- December 2026 Movie Releases: డిసెంబర్లో సినిమా జాతర.. ఏకంగా 15 మూవీస్ రిలీజ్.. పూర్తి లిస్ట్ ఇదే..
- 750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!
మెటా నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘హౌస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ 2026’ కార్యక్రమంలో ఈ పాటను తొలిసారిగా ఆవిష్కరించారు. ఈ ఈవెంట్‌కు దేశవ్యాప్తంగా 700 మందికి పైగా ప్రముఖ కంటెంట్ క్రియేటర్లు హాజరయ్యారు. వారంతా కలిసి పాటను మరింత ప్రత్యేకంగా ప్రమోట్ చేశారు. ఇక ‘కింగ్’ సినిమా విషయానికి వస్తే.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలవుతున్న ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘డాడీ కూల్ (కింగ్ వెర్షన్)’ పాట ప్రస్తుతం జీ మ్యూజిక్ కంపెనీ, టీ-సిరీస్ అధికారిక యూట్యూబ్ ఛానెళ్లలో అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Shah Rukh Khan-Kareena: పదిహేనేళ్ల తర్వాత షారుఖ్ – కరీనా కాంబో రిపీట్.. డ్యాన్స్ ఫ్లోర్‌ను దుమ్ములేపేసారుగా..!
-
RBI New ATM Rules 2026: ATM నుంచి డబ్బులు తీసేవారికి RBI కొత్త రూల్స్.. యూజర్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
-
Natural Star Nani: యాక్షన్‌కు నాని గుడ్‌బై? మళ్లీ ఫ్యామిలీ కథల వైపు నేచురల్ స్టార్!
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
-
December 2026 Movie Releases: డిసెంబర్లో సినిమా జాతర.. ఏకంగా 15 మూవీస్ రిలీజ్.. పూర్తి లిస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!