ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి కట్టుకున్న భార్యపై లైంగిక దాడి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భర్తతో సహా అతడి ఇద్దరి స్నేహితులను అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితుడు తన 23 ఏళ్ల భార్యతో కలిసి ముంబైలో నివాసం ఉంటున్నాడు. ఉద్యోగం లేని అతడు డబ్బుల కోసం తన స్నేహితులతో కలిసి దొంగతనాలు, స్మగ్లింగ్ వంటి నేరాలకు పాల్పడుతుంటాడు.
Also Read: Covid Alert: పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తంగా ఉండాలి
అలా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో స్నేహితులు అతడికి డబ్బు ఆశ చూపి తన భార్యతో లైంగిక కోరిక తీర్చమని కోొరారు. దీంతో ఆ భర్త తన స్నేహితులకు మద్దతు ఇవ్వాల్సిందిగా భార్యను బలవంతం చేశాడు. ఆమె నిరాకరించడంతో స్నేహితులతో కలిసి భార్యపై లైంగిక దాడికి తెగబడ్డాడు. దగ్గరుండి మరి భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయించాడు. ఈ ఘటనపై బాధిత మహిళ భర్త అతడి స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగురిని అరెస్టు చేశారు.
Also Read: Kerala: అమానవీయ ఘటన.. వృద్ధురాలైన అత్తను దారుణంగా కొట్టిన కోడలు, వీడియో వైరల్