Maha Kumbh Mela: ‘‘ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’’ అనే కొటేషన్ చాలా మందికి సుపరిచితమే. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న ‘‘మహా కుంభమేళా’’ని ఓ యువకుడు తన ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. కోట్ల సంఖ్యలో హాజరయ్యే భక్తులకు ‘‘వేప పుల్లలు’’ అమ్ముతూ వేలు సంపాదిస్తున్నాడు. భక్తులు తమ దంతాలను శుభ్రపరుచుకోవడానికి సదరు యువకుడి వద్ద నుంచి పుల్లలను కొనుగోలు చేస్తున్నారు.