Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్‌పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
- బెంగాల్లో మమతా బెనర్జీకి నిరసన సెగ..
- దీదీ కాన్వాయ్‌పై చెప్పులు, బురదతో నిరసనకారులు దాడి..
- తనను చంపేసే వారంటూ మమత ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రికి నిరసన సెగ ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారుపై ఆందోళనకారులు దాడి చేశారు. తమపై గుర్తుతెలియని దుండగులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని, ఈ దాడిలో ప్రాణాలు పోయేవే అని మమత ఆరోపించారు. ఈ దాడిని రాష్ట్ర బీజేపీ ఖండించింది. ఈ హింసాకాండలో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
పోలీస్ కస్టడీలో టీఎంసీ పార్టీ కార్యకర్త మరణించాడని ఆ పార్టీ బెంగాల్లో తీవ్ర నిరసన తెలుపుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తల ఇంటికి మమతా బెనర్జీ వెళ్తుండగా హాలిసహర్‌లో నిరసన ఎదుర్కొన్నారు. నిరసనకారులు మమతా బెనర్జీ కారును చుట్టుముట్టి దానిపై బురద రాసి, బూట్లు, నీళ్ల సీసాలు విసిరినట్లు తెలుస్తోంది. నిరసనకారుల్ని పోలీసులు వెనక్కి తోసేయడానికి ప్రయత్నించారు. మమతను ఉద్దేశిస్తూ ‘‘దొంగను తరిమికొట్టండి’’ అని నిరసనకారులు నినాదాలు చేశారు.
Also Read
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
- LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
ఇటుకలు, రాళ్లు తమపై పడి ఉంటే తాను చనిపోయి ఉండేదాన్ని అని మమతా బెనర్జీ మీడియాతో అన్నారు. బయట నుంచి వచ్చిన సంఘవిద్రోహ శక్తులు పోలీసుల ముందే తన కారుపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. నా కారు కిటీలు మూసి ఉండకపోతే, నా తల పగిపోయి, చనిపోయే దాన్ని అని, ఇలాంటి దాడిని ఎప్పుడూ ఎదుర్కోలేదని, మమ్మల్ని కాపాడటానికి పోలీసులు ఏం చేయలేదని, వాళ్లు కేవలం బీజేపీకి మాత్రమే రక్షణ కల్పిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, రాజ్యసభ ఎంపీ డోలా సేన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
మమతా బెనర్జీ కాన్వాయ్‌పై జరిగిన దాడిని బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య ఖండించారు. ఈ ఘటనలో తమ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాళ్లు, బురద, చెప్పులు విసరడాన్ని బీజేపీ సమర్థించదని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తాయని, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్ పోలీసుల అదుపులో ఉన్న సమయంలో అనారోగ్యానికి గురై మరణించడంతో వివాదం మొదలైంది. పోలీసులు చిత్రహింసల వల్లే తమ పార్టీ కార్యకర్త మరణించారని టీఎంసీ ఆరోపిస్తోంది. ఈ సంఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అతడి భార్య డిమాండ్ చేస్తోంది. పోలీసులు మాత్రం గుండెపోటు కారణంగానే అతను మరణించినట్లు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?