Mamata Banerjee: హిందువులపై హింస.. యూఎన్‌కి మమతా బెనర్జీ పిలుపు..
- బంగ్లాదేశ్ హిందువులపై కొనసాగుతున్న అణిచివేత..
- యూఎన్ శాంతిదళాలను మోహరించాలని కోరిన మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువుల అణిచివేత జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రముఖ హిందూ నేతల్ని అక్కడి మహ్మద్ యూనస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తోంది. రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్ల కారణంగా షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆ దేశవ్యాప్తంగా మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. గుడులు, హిందూ వ్యాపారాలు, ఇళ్లపై దాడులు చేస్తూనే ఉన్నారు.
Read Also: PM Modi-Putin: భారత్‌లో పర్యటించండి.. పుతిన్‌కి మోడీ ఆహ్వానం..
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
ఇదిలా ఉంటే, హిందువులపై జరుగుతున్న దాడుల గురించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాన్ని ఆ దేశంలో మోహరించాలని సూచించారు. పొరుగు దేశంలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించాలని ప్రధాని నరేంద్రమోడీని ఆమె కోరారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడిన ఆమె హిందువుల దాడిని ఖండించారు. “కులం, మతం లేదా మతంతో సంబంధం లేకుండా ఏ రకమైన దురాగతాలను మేము ఖండిస్తున్నాము. బంగ్లాదేశ్‌కు శాంతి పరిరక్షక బృందాన్ని పంపాలని కూడా నేను సూచిస్తున్నాను. ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి బంగ్లాదేశ్ పరిణామాలను పట్టించుకోవాలి” అని ఆమె అన్నారు. ఇలాంటి సంఘటనలు కొనసాగితు, మేము మా ప్రజల్ని తీసుకురావాలని అనుకుంటున్నాము, వారికి ఎలాంటి ఆహార కొరత రాదని నేను హామీ ఇస్తుున్నానని మమతా బెనర్జీ అన్నారు.
ఇటీవల ఆ దేశంలో ప్రముఖ హిందూ మత గురువు చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ చేయడం వివాదంగా మారింది. దీనిపై భారత్ కూడా స్పందించింది. మైనారిటీలకు రక్షణ కల్పించాలని అక్కడి ప్రజల్ని కోరింది. హిందూ హక్కుల గురించి మాట్లాడిన చిన్మోయ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆయన మద్దతుదారుల్ని కూడా అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. అక్కడి యూనస్ ప్రభుత్వం మైనారిటీల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..