Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: నేపాల్‌లో సంభవించిన విధ్వంసకర వరదలపై కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. నేపాల్‌లో భారీ వరదల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని ఖర్గే పేర్కొన్నారు. వరదల కారణంగా 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 1,000 మందికి పైగా గల్లంతైనట్లు ఖర్గే తన లేఖలో తెలిపారు. వేలాది మంది ప్రజలు ఆహారం, మందులు, నివాసం, ఇతర అత్యవసర సదుపాయాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో భారత ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు అవసరమైన మానవతా, సహాయక చర్యలను అందించాలని ఖర్గే కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసి, బాధితులకు అవసరమైన ఆహారం, మందులు, నివాసం వంటి అత్యవసర సదుపాయాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వరదల కారణంగా నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో భారతీయులు, భారతీయ మూలాలున్న వ్యక్తులు కూడా చిక్కుకుపోయారని ఖర్గే తెలిపారు. వారిని గుర్తించి సురక్షితంగా భారత్‌కు తరలించేందుకు రెస్క్యూ, తరలింపు చర్యలను ముమ్మరం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నేపాల్‌లో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో భారత ప్రభుత్వం వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఖర్గే తన లేఖ ద్వారా స్పష్టం చేశారు. బాధిత ప్రజలకు మానవతా దృక్పథంతో అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించాలని కేంద్రాన్ని కోరారు.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు