Jammu Kashmir Assembly Polls: నేడు జమ్మూకశ్మీర్‌కు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే
- జమ్మూ కశ్మీర్ లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..
- జమ్మూ.. శ్రీనగర్‌లోని పార్టీ కీలక నేతలతో మల్లికార్జున ఖర్గే.. రాహుల్ గాంధీ భేటీ..
- నేటి నుంచి రెండ్రోజుల పాటు జమ్మూ కశ్మీర్ లో ఖర్గే.. రాహుల్ కీలక సమావేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir Assembly Polls: నేటి నుంచి రెండ్రోజుల పాటు జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. జమ్మూ, శ్రీనగర్‌లోని పార్టీ కీలక నేతలతో పాటు పార్టీ శ్రేణులతో వారు సమావేశం కానున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాల కోసం తీసుకు కోవాల్సిన చర్యలపై వారితో వీరిరువురు చర్చించనున్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా తెలిపారు. నేటి (బుధవారం) మధ్యాహ్నం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ జమ్మూకు చేరుకుంటారు. ఆ తర్వాత వారు.. పార్టీ శ్రేణులతో భేటీ అవుతారు.
Read Also: Nithin: హ్యాట్రిక్ పై కన్నేసిన కుర్ర హీరో.. దసరా బరిలో ఆగస్టు 15 విన్నర్..?
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
ఇక, ఆ తర్వాత శ్రీనగర్ లో సైతం కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలతో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. ఈ ఎన్నికల్లో ఇతర పార్టీలతో కాంగ్రెస్ పార్టీ జత కట్టే అవకాం ఉందని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. అధికారంలోకి రాకుండా భారతీయ జనతా పార్టీని నియంత్రించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నారు. మరోవైపు నాలుగు రాష్ట్రాలు.. హరియాణ, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, స్ర్కీనింగ్ కమిటీ సభ్యులతో సోమవారం న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమావేశమై చర్చించారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మూడు విడుతల్లో జరగబోతుంది. అందులోభాగంగా తొలి విడత నోటిఫికేషన్ మంగళవారం ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఈ ఎన్నికల ఫలితాలు ఆక్టోబర్ 4న వెలువడనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ లో జరగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి.
Read Also: Road Accident: తాడిపత్రిలో ఘోర ప్రమాదం.. స్పాట్లోనే ముగ్గురు మృతి
అయితే, ఈ నేపథ్యంలో అధికారాన్ని హస్త గతం చేసుకునేందుకు అటు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీలే కాకుండా.. ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు సైతం మాస్టర్ ప్లాన్స్ తో ముందుకు వెళ్తున్నాయి. ఇంకోవైపు బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
On 21st and 22nd August, Hon’ble Congress President Shri Mallikarjun @kharge ji and Leader of Opposition Shri @RahulGandhi ji will be visiting Jammu and Srinagar for key meetings in preparation for the upcoming assembly elections.
— K C Venugopal (@kcvenugopalmp) August 20, 2024
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!