Mahua Moitra: దుబాయ్ నుంచి 47 సార్లు లాగిన్.. మహువా మోయిత్రా కేసులో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: ‘‘ క్యాష్ ఫర్ క్వేరీ ’’ కేసులో మహువా మోయిత్రాపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీని విమర్శించేందుకు అదానీ వ్యవహారాన్ని అస్త్రంగా ఉపయోగించుకున్నారని, పార్లమెంట్లో అదానీపై ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకుందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. అయితే ఈ కేసులో పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి ఇప్పటికే హీరానందానీ అఫిడవిట్ సమర్పించారు. మహువా తన దగ్గర నుంచి గిఫ్టులు తీసుకున్నారని తెలిపారు.
Read Also: Manchu Manoj: అంబానీతో మంచు మనోజ్ దంపతులు.. పిక్ వైరల్
Also Read
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
ఇదిలా ఉంటే ఈ కేసులో రేపు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు మహువా మోయిత్రా హాజరుకాబోతున్నారు. తన పార్లమెంట్ లాగిన్ వివరాలను మోయిత్రా ఇతరులకు అందించిందని, దాంతో దుబాయ్ నుంచి వేరే వ్యక్తులు ప్రశ్నలు అడిగినట్లు నిషికాంత్ దూబే ఆరోపించిన నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ ఇప్పటికే మహువాకు సంబంధించిన విదేశీ వ్యవహారాలు, కేంద్ర హోం, ఐటీ మంత్రిత్వ శాఖల నుంచి నివేదికలు అందుకున్నట్లు సమచారం. విశ్వసనీయ వర్గాలు తెలిపిన దాని ప్రకారం ఆమె తన పార్లమెంట్ అకౌంట్ దుబాయ్ నుంచి 47 సార్లు వినియోగించినట్లు తెలుస్తోంది. ఎథిక్స్ కమిటీకి హాజరయ్యే ముందు రోజే ఈ వివరాలు వెల్లడయ్యాయి.
మోయిత్రా తను పార్లమెంట్ అకౌంట్ ద్వారా దర్శన్ హీరానందానీ కొరకు ప్రశ్నలు అడిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన లాగిన్ వివరాలను స్నేహితుడైన హీరానందానీతో పంచుకున్నట్లు ఇప్పటికే మోయిత్రా ఒప్పుకున్నారు, అయితే తాను డబ్బులు తీసుకున్నారనే విషయాన్ని కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, మోయిత్రాపై ఆరోపణలు పెంచారు. హీరానందానీ స్థలం నుంచే 47 సార్లు లాగిన్ అయినట్లు ఆరోపించారు. ఈ వార్తలు నిజమైతే దేశంలోని ఎంపీలంతా మహువా అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలని, ఆమె హీరానందానీ కొరకు ప్రశ్నలు అడిగారని, పెట్టుబడిదారుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రోత్సహించారని ఎక్స్(ట్విట్టర్)లో మండిపడ్డారు.
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..