Mahua Moitra: లంచం తీసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారు.. టీఎంసీ ఎంపీపై బీజేపీ ఎంపీ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి ఆమె ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు తీసుకున్నారని ఆరోపించారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దూబే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
పార్లమెంట్ లో ప్రశ్నలు అడగేందుంకు ఎంపీకి, సదరు వ్యాపారవేత్తకు మధ్య లంచాలు మారాయని, డబ్బులు, గిఫ్టుల రూపంలో లంచాలు తీసుకున్నారని బీజేపీ ఎంపీ దూబే ఆరోపించారు. మహువా మొయిత్రాను వెంటనే సభ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ని కోరాడు.
Also Read
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
- Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడల్లా మహువా మొయిత్రాతో పాటు టీఎంసీ ఎంపీలకు సభకు అడ్డుతగలడం అలవాటుగా మారిందని, ప్రతీ ఒక్కరిపై ఏదో సాకుతో సభను నిరంతరం దుర్వినియోగం చేస్తున్నారని, ఆమె ఇటీవల కాలంలో లోక్‌సభలో అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు అదానీ గ్రూపు పై ఉన్నాయని.. ఈ వ్యాపార గ్రూపు పైనే అక్రమాలు జరిగాయని ఆమె తరుచుగా ఆరోపించారని దూబే స్పీకర్ కి రాసిన రెండు పేజల లేఖలో పేర్కొన్నారు.
Read Also: ENG vs AFG: వరల్డ్ కప్‌లో సంచలనం.. ఇంగ్లాండ్‌పై అఫ్గానిస్తాన్ ఘన విజయం
తృణమూల్ కాంగ్రెస్ నేతల వ్యూహాలు సామాన్య ప్రజల సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చించేందుకు, ఇతర సభ్యుల రాజ్యాంగ హక్కుల్ని హరిస్తున్నాయిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. ‘క్విడ్ ప్రోకో’ విధానంలో ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకుని మరో వ్యాపార గ్రూపుని లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీ ఎంపీ ఆరోపించారు. మహువా మొయిత్రా ఫైర్ బ్రాండ్ ఎంపీ అనే బిరుడు బూటకం తప్ప మరేమి కాదని విమర్శించారు.
దూబే వ్యాఖ్యలపై స్పందించిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా… తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలనైనా స్వాగతిస్తానని అన్నారు. నకిలీ డిగ్రీవాలా, ఇతర బీజేపీ ప్రముఖులపై అధికార ఉల్లంఘనలు పెండింగ్ లో ఉన్నాయని, స్పీకర్ వాటిని పరిష్కరించిన వెంటనే నాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే స్వాగతిస్తానని, నా గుమ్మం ముందుకు వచ్చే ముందు ఈడీ, ఇతర ఏజెన్సీలు అదానీ బొగ్గు కుంభకోణంపై ఎఫ్ఐార్ నమోదు చేయాలని ఆమె అన్నారు. మహువా మోయిత్రా ప్రస్తుతం బెంగాల్ లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తాజావార్తలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!