Mahua Moitra: “ప్రశ్నకు డబ్బు కుంభకోణం”.. టీఎంసీ ఎంపీపై కేంద్ర ఐటీశాఖ మంత్రికి ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభలో చర్చల సమయంలో ప్రశ్నించడానికి ఓ వ్యాపారవేత్త నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ నిన్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు దూబే ఉత్తరం రాశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందనీ, ఎంపీ మహువా మొయిత్రాల మధ్య లంచాల మార్పిడి జరిగిందని, సుప్రీంకోర్టు లాయర్ నునంచి తనకు తిరుగులేని సాక్ష్యాలు అందాయని నిషికాత్ దూబే లేఖలో ప్రస్తావించారు.
తాజా సంఘటన 2005 నాటి ‘క్యాఫ్ ఫర్ క్వేరీ’ కుంభకోణాన్ని గుర్తు చేస్తుందని, దీనిపై విచారణ కమిటీ వేయాలని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మరోసారి మొయిత్రాపై పదునైన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే. మహువా మొయిత్రా తన లోక్‌సభ వెబ్‌సైట్ లాగిన్ వివరాలను హీరానందానీ, అతని గ్రూపుకు అందిచారని, దీనిపై దర్యాప్తు చేయాలని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయక మంత్రి రాజీవ్ చంద్రశేఖర్లకు లేఖను రాశారు.
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
Read Also: Asaduddin Owaisi: భారతదేశ విభజనపై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు..
మొయిత్రా లోక్ సభ ఖాతా ఆమె లేని సమయంలో ఎక్కడెక్కడి ఐపీ అడ్రస్‌ల నుంచి లాగిన్ యాక్సెస్ అయ్యాయో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించాలని ఆయన కోరాడు. తన వాదనలు, ఆరోపణలు నిజమైతే మహుమా మొయిత్రా దేశభద్రతపై తీవ్రమైన విశ్వాస ఉల్లంఘనకు పాల్పడినట్లు అవుతుందని బీజేపీ ఎంపీ పేర్కొన్నారు.
మోయిత్రా ప్రవర్తన “అనైతికం, చట్టవిరుద్ధం మరియు దేశ భద్రతకు హానికరం” అని పేర్కొన్న దూబే, ఆమెపై వచ్చిన ఆరోపణలను “అత్యంత తీవ్రంగా” పరిగణించాలని ఐటి మంత్రిత్వ శాఖను కోరారు. అంతకుముందు స్పీకర్ కి రాసిన లేఖలో ఎంపీ మొయిత్రా పార్లమెంట్ లో అడిగని 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు అదానీ గ్రూపుపైనే అడిగారని, ఉద్దేశపూర్వకంగా సదరు కంపెనీని ఇబ్బందులు పెట్టాలనే ఇలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!