Congress: ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ‘రామ మందిరాన్ని’’ శుద్ధి చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని శుద్ధి చేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అధికారంలోకి రాగానే నలుగురు శంకరాచార్యులచే రామమందిరాన్ని శుద్ధి చేస్తామని చెప్పారు. ఆలయ నిర్మాణంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్‌కి విరుద్ధంగా వ్యవహరించారని, ఇండియా కూటమి ప్రభుత్వం వాటిని సరిదిద్దుతుందని నానా పటోలే అన్నారు. ఆలయ నిర్మాణం పూర్తికాలేదని, జనవరి 22న జరిగిన రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరుకాలేదు.
Read Also: PM Modi: పాక్‌తో యుద్ధం తర్వాత 93 వేల సైనికులు సరెండర్ అయ్యారు
Also Read
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య ఆలయంలో రామ్ దర్బార్ ఏర్పాటు చేస్తామని నానాపటోలే అన్నారు. ‘‘అక్కడ ఉంది రాముడి విగ్రహం కాదు, రామ్ లల్లా విగ్రహం. నరేంద్రమోడీ ఆలయ నిర్మాణంలో ప్రోటోకాల్‌కి విరుద్ధంగా వ్యవహరించారు. మేము దీనిని సరిదిద్దుతాం.’’ అని అన్నారు. నలుగురు శంకరాచార్యులు సరైన ఆచారాలు పాటించలేదని చెప్పారని అన్నారు. సనాతన ధర్మంలో ఎవరి కుటుంబంలో చావు సంభవిస్తే క్షౌరం చేయించుకుంటాము, కానీ ప్రధాని మోడీ అలా చేయలేదని అన్నారు.
నానా పటోలే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. హిందువుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పనిచేస్తోందని ఆరోపించారు. ‘‘సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వడం ద్వారా రాముడి ఉనికిని కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసింది. రామసేతును సవాల్ చేశారు. రాముడు నిజమా కాదా.? అని ప్రశ్నలు అడిగేవారు’’ అని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ మందిర అంశాన్ని కాంగ్రెస్ కావాలనే దారి మళ్లించిందని, అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే బీజేపీ ప్రభుత్వం ఆలయ నిర్మాణాన్ని చేపట్టిందని అన్నారు.
తాజావార్తలు
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!