Congress: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ పీసీసీ చీఫ్ నానా పటోలే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతుంటే, శివసేన నేత ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ తమతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆఫర్ ఇచ్చారు. ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేసి ప్రతిపక్షంతో చేరితే షిండే, పవార్‌లు ఇద్దరికీ ముఖ్యమంత్రి పదవులు ఇస్తామని పటోలే శుక్రవారం అన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. మూడోసారి ముచ్చటగా సీఎంగా ప్రమాణం చేశారు. ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా చేసినట్లు ఉదయం నుంచి వార్తలు హల్‌చల్ చేశాయి.
Maharashtra PCC: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం జరిగింది. ‘మహా’ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి నానా పటోలే రిజైన్ చేశారు.
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలు ముగిశాయి. 288 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’ కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. ఇదిలా ఉంటే, ఇంకా ఫలితాలు రాకముందే ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో సీఎం అభ్యర్థిపై కొట్లాట మొదలైంది.
Supriya Sule: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే ఓటేసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తాను అక్రమ బిట్‌కాయిన్ లావాదేవీలకు పాల్పడినట్లు బీజేపీ చేస్తున్న ఆరోపణలను తప్పుబట్టింది.
"Dog" Remark: మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటేలే బీజేపీ నేతల్ని ఉద్దేశిస్తూ చేసిన ‘‘కుక్క’’ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న మహారాష్ట్రలో ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారాయి. బీజేపీ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ ‘‘నిరాశ’’ చెందుతోందని అభివర్ణించింది. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి తీవ్ర నిరుత్సాహంతో ఉందని బీజేపీ నేత కిరీట్ సోమయ్య అన్నారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ కార్యకర్తతో కాళ్లు కడిగించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Congress: ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని శుద్ధి చేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
మహారాష్ట్రలో కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన కారును వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగంగా భారీగా దెబ్బతింది.