ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణం జరిగింది. లులు మాల్ మేనేజర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. మహిళా ఉద్యోగిని ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. అనంతరం హోటల్‌కి తీసుకెళ్లి.. మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఇస్లాం మతంలోకి మారాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఇక బాధితురాలు జరిగిన ఘోరాన్ని పోలీసులకు తెలియజేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: School Bus Fire Accident: స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..!
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రఖ్యాత లులు మాల్ ఉంది. అందులో సుల్తాన్‌పూర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల మహిళా ఉద్యోగి పని చేస్తోంది. మాల్‌లో మేనేజర్‌గా ఉన్న 27 ఏళ్ల మహ్మద్ ఫర్హాజ్ ఆమెను ట్రాప్‌లో పడేశాడు. ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. రహస్యంగా వీడియో తీసి పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నాడు. హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన డిమాండ్లకు అంగీకరించకపోతే వీడియోను ఆన్‌లైన్‌లో పెడతానంటూ బెదిరించాడని వాపోయింది. గతంలో ఫర్హాజ్ అతడి ఇంటికి కూడా తీసుకెళ్లాడని.. అక్కడ తనపై దాడి చేసి సిగరెట్‌తో కాల్చాడని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Dhanush : ధనుష్ ప్రాజెక్టు నుంచి పూజా హెగ్డే ఔట్..
నిందితుడిపై గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నంబర్ 608/25, BNS సెక్షన్లు 64, 123, 308, 115(2), 352, మరియు 351(3) కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ సౌత్ నిపున్ అగర్వాల్ తెలిపారు. కేసులో సమర్పించిన ఆధారాలు, వాదనలు, వస్తువులను ధృవీకరిస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే గతంలో ఈ మాల్‌లో నమాజ్ చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో మతపరమైన స్థలంగా మార్చారంటూ హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. అనంతరం మాల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రార్థనలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. మాల్‌లో మత పరమైన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.