ఇండస్ట్రీలో విజయాలు, పరాజయాలు నార్మల్, ఒక్కోసారి చేతిలోకి వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఇలాంటి సందర్భాలు సినిమా పరిశ్రమలో ఎన్నో చూశాం. ఒక రోజు సక్సెస్‌తో స్టార్‌గా నిలబడిన వారు.. ఒకట్రెండు ఫ్లాప్ రాగానే ఆఫర్లు చేజారిపోతాయి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం పూజా హెగ్డేకు ఎదురైంది. ఆమెను నుంచి చేజారిన ఆఫర్ గురించిన వివరాల్లోకి వెళితే.. గతంలో పూజా హెగ్డే వరుస హిట్లతో దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకొనే హీరోయిన్లతో ఒకరిగా నిలిచింది. అందం, అభినయంతో ఆకట్టుకునే పాత్రలో నటి మెప్పించింది. అయితే స్టార్‌గా టాప్ రేంజ్‌లోకి చేరుకొన్న ఆమె కెరీర్ ఒక్కసారిగా రివర్స్ అయింది. రాధే శ్యామ్ , బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసి కా భాయ్, కిసి కీ జాన్, దేవా, రెట్రో సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.
Also Read : Mrunal Thakur : మృణాల్ పెళ్లైపోయిందా? షాక్ లో ఫ్యాన్స్!
ఇటీవల ఆమె ఎన్నో ఆశలు పెట్టుకొని డీగ్లామరైజ్డ్ పాత్రలో నటించిన రెట్రో కూడా అభిమానులకు నిరాశను మిగిల్చింది. ఇలా వరుస ఫ్లాప్‌లతో ఆమె క్రేజ్ కొంత తగ్గింది. దీంతో తాజాగా ఆమెను తీసుకోబోయిన ధనుష్ కొత్త సినిమాలో దర్శకుడు విగ్నేష్ రాజా ఆ ఆఫర్‌ను రద్దు చేసి, ఆమె స్థానంలో తాజా క్రేజ్ కలిగిన మలయాళ బ్యూటీ మమితా బైజును ఎంపిక చేశారని సమాచారం. ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మమితా ఇప్పటికే దళపతి విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలతో ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఇక ఇప్పుడు ధనుష్ సరసన కూడా ఛాన్స్ రావడం ఆమెకు గోల్డెన్ జంప్ అనిపిస్తుంది. ఇక పూజా మాత్రం ఇప్పటికీ రజనీకాంత్, విజయ్, లారెన్స్ సినిమాలతో బిజీగా ఉంది.