పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత నెల 28న ప్రారంభమైన దగ్గర నుంచి సమావేశాలు సజావుగా సాగడం లేదు. అధికార-ప్రతిపక్ష సభ్యుల మాటల యుద్ధంతో సభా రసాభాసగా సాగుతోంది.
ఇది కూడా చదవండి: Ghaziabad Case: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడలేకపోయారు. మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకాన్ని ప్రస్తావించినందుకు స్పీకర్, కేంద్రమంత్రులు అడ్డుకున్నారు. అనంతరం ప్రధాని మోడీ కూడా మాట్లాడాల్సి ఉంది. కానీ మోడీ మాట్లాడకుండానే రాష్ట్రపతి ధన్యవాద తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. లోక్‌సభలో ప్రధాని మోడీపై ప్రతిపక్ష సభ్యులు దాడి చేసే అవకాశం ఉందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మోడీ మాట్లాడకుండానే ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించేశారు.

ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు మండిపతున్నాయి. ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధపడుతున్నారు. సోమవారం ఉదయం మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఇండియా కూటమి సభ్యులంతా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష సభ్యులంతా అంగీకారం తెలిపారు. దీంతో 100 మంది ఎంపీల సంతకాలతో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు విపక్షాలు నోటీసు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
INDIA Bloc to participate in Union Budget discussion in both Houses
Read @ANI Story | https://t.co/E3evmDbgOn#IndiaBlocLeaders #Congress #MallikarjunKharge #RahulGandhi #Parliament #UnionBudgetSession pic.twitter.com/rzi0tnWTj5
— ANI Digital (@ani_digital) February 9, 2026