ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేసినందుకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగర పాలక సంస్థ సేవలు మరియు విజిలెన్స్ విభాగాలను అతిషికి అప్పగించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ప్రతిపాదనను పంపినట్లు అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి.
ఢిల్లీ సర్వీసుల బిల్లు-2023ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రేపు(సోమవారం) రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు బదిలీ చేసే ఆర్డినెన్స్ స్థానే కేంద్రం ఇటీవల తీసుకు వచ్చిన బిల్లును విపక్ష ఎంపీల ఆందోళన మధ్య లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుకు లోక్‌సభ ఆమోదించింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల వాకౌట్ చేశాయి. విపక్షాల వాకౌట్, నిరసనల మధ్య కేంద్రం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించింది.
ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై గురువారం లోక్‌సభలో చర్చిస్తున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఢిల్లీ కోసం చట్టాలు చేయడానికి కేంద్రాన్ని అనుమతించే నిబంధనలు రాజ్యాంగంలో ఉన్నాయని ఆయన అన్నారు.