Kolkata gangrape: దక్షిణ కోల్‌కతా లా కాలేజీలో 24 ఏళ్ల లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత మోనోజిత్ మిశ్రాతో పాటు మరో ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజ్ క్యాంపస్‌లోని గార్డు రూంలో బాధితురాలిపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన చర్యలను నిందితులు మొబైల్స్‌లో వీడియో తీశారు. ఈ ఘటనపై టీఎంసీ పార్టీపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.
Kolkata Rape Case: కోల్‌కతా లా విద్యార్థినిపై అత్యాచార ఘటన రాజకీయ దుమారానికి కారణమైంది. ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా(31)కు అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) స్టూడెంట్ వింగ్‌తో సంబంధం ఉండటం వివాదాన్ని మరింత పెంచింది. ఈ కేసులో ముగ్గురు నిందితులతో పాటు క్యాంపస్ సెక్యూరిటీ గార్డును కూడా అరెస్ట్ చేశారు.
Kolkata rape Case: కోల్‌కతా లా విద్యార్థిని అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆర్జీకల్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్యురాలిపై అత్యాచార ఘటన మరవకముందే ఈ ఘటన చోటు చేసుకుంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా(31)కి అధికార టీఎంసీ పార్టీలో సంబంధం ఉంది. టీఎంసీ స్టూడెంట్ విభాగంలో కీలక వ్యక్తిగా ఉన్నాడు.
Kolkata Rape Case: కోల్‌కతా లా కాలేజ్ క్యాంపస్ లోపల 24 ఏళ్ల లా విద్యార్థినిపై అత్యాచారం పశ్చిమ బెంగాల్‌ని కదిపేస్తోంది. ఆర్జీకల్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్‌లో పీజీ వైద్యురాలిపై అత్యాచారం ఘటన మరవక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఇప్పటికే, రాజకీయ రచ్చ మొదలైంది.
కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన అందరినీ కలచివేసింది. ఈ కేసులో పట్టణ పోలీసులు నిందితులు మనోజిత్ మిశ్రా (31), జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖోపాధ్యాయ అలియాస్ ప్రమిత్ ముఖర్జీ (20)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా మాజీ విద్యార్థి, టీఎంసీ స్టూడెంట్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. వాస్తవానికి.. జూన్ 25న కళాశాల లోపల తనపై సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు…