World Cup 2023: ఖలిస్తానీల బరితెగింపు.. ప్రపంచకప్ ముందు ‘ఖలిస్తాన్ జిందాబాద్’ అంటూ స్లోగన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Cup 2023: భారతదేశం ప్రతిష్టాత్మకంగా ఐసీసీ ప్రపంచకప్ మ్యాచుల్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే విదేశీ జట్లు భారత్ చేరుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచును టార్గెట్ చేస్తూ ఖలిస్తానీ వేర్పాటువాదులు రభస చేయాలని చూస్తున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ‘ఖలిస్తాన్ జిందాబాద్’ అనే స్లోగన్స్ వెలుగులోకి వచ్చాయి. ధర్మశాలలోని జలశక్తి డిపార్ట్మెంట్ భవనం గోడపై ఈ నినాదాలు కనిపించాయి. నిందిలను పట్టుకునేందుకు అధికారులు వేట ప్రారంభించారు. విచారణ ప్రారంభించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. కాంగ్రా ఎస్పీ షాలిని అగ్నిహోత్రి మాట్లాడుతూ.. స్పే పెయింట్ తో నినాదాలు రాసినట్లు మంగళవారం రాత్రి అధికారులకు సమాచారం వచ్చిందని చెప్పారు. ఈ ఘటన వెనక ఎవరున్నారో తెలుసుకునేందుకు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: India-Canada: కెనడాకు భారత్ అల్టిమేటం.. ప్రైవేటుగా చర్చిస్తామంటున్న కెనడా..
Also Read
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
- Donald Trump: "తీవ్రమైన దాడి చేస్తాం".. చర్చల వేళ ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
- Uddhav Shiv Sena: ఉద్ధవ్‌పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..
- Uttar Pradesh: హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి వివాహం.. పోలీసులే పెళ్లి పెద్దలు..
ఇదిలా ఉంటే వన్డే ప్రపంచకప్ మ్యాచులకు ముందు ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళనకరంగా మారాయి. ధర్మశాల నగరంలో 5 మ్యాచులు జరగనున్నాయి. ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్లు నగరానికి రావడం ప్రారంభించారు. అంతకుముందు ఖలిస్తానీ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రపంచకప్‌ని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇండియా, కెనడాల మధ్య ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తీవ్ర దౌత్యవివాదంగా మారింది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం సమస్యను పెంచింది.
తాజావార్తలు
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
-
Shwetha Menon: మలయాళ ‘అమ్మ’లో సంక్షోభం.. అధ్యక్షురాలు సహా మొత్తం కార్యవర్గం రాజీనామా!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!