Siddaramaiah: 2024లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddaramaiah: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించబోతోంది. 139 స్థానాల్లో ఇప్పటికే లీడింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలని ఆశిస్తున్నట్లు సిద్దరామయ్య అన్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన రాహుల్ గాంధీ 2024లో ప్రధాని అవుతారని కాంగ్రెస్ అధినేత ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: Revanth Reddy: బీఆర్‌ఎస్ 25, ఎంఐఎం 7, బీజేపీ 9 లోపే.. మిగిలిన సీట్లు కాంగ్రెస్ వే
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
కర్ణాటక ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వచ్చిన ఆదేశమని అభివర్ణించారు సిద్ధరామయ్య. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు ఇది గీటురాయిగా నిలుస్తుందని అన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఓడించేలా చూస్తామని, రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇది నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు వ్యతిరేకంగా వచ్చిన ఆదేశం అని, ప్రధాని 20 సార్లు కర్ణాటకకు వచ్చారని, గతంలో ఏ ప్రధాని కూడా ఇలా ప్రచారం చేయలేదని సిద్ధరామయ్య అన్నారు.
130 సీట్లు కూడా దాటుతాం, ఇది కాంగ్రెస్ పార్టీ ఘన విజయం, బీజేపీ ప్రభుత్వంతో విసిగిపోయిన కర్ణాటక ప్రజలు మార్పును కోరుకున్నారని,ఆపరేషన్ ‘కమలానికి’ బీజేపీ భారీగానే ఖర్చు చేసిందని సిద్ధరామయ్య అన్నారు. రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’తో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందని ఆయన అన్నారు. ‘‘ఇది లౌకిక పార్టీ సాధించిన విజయం, కర్ణాటక ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ కు ఈ ఫలితాలు అందించారు.’’ అని ఆయన ట్వీట్ చేశారు. 224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 139 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 62 స్థానాల్లో ,జేడీయూ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!