Veer Savarkar: స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్‌ని ఉద్దేశించి ఓ వ్యక్తి అవమానకరమైన సోషల్ మీడియా పోస్టు పెట్టడం వివాదాస్పదమైంది. హిందుత్వ సిద్ధాంతకర్తగా పేరున్న వీర్ సావర్కర్‌పై తన ఫోస్‌బుక్ స్టోరీలో కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో కర్ణాటకలోని కొప్పల్‌కి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. హుస్సేన్‌సాబ్ అనే వ్యక్తి, ఇతని ఫేస్‌బుక్ యూజర్ నేమ్ ‘టిప్పు’. ‘‘”సావర్కర్ భారతదేశపు మొదటి ఉగ్రవాది’’ అని పోస్ట్ పెట్టాడు.
Read Also: All Eyes On Rafah: అప్పుడు మీ అందరి కళ్లు ఎక్కడున్నాయి.. ‘‘ఆల్ ఐస్ ఆన్ రఫా’’పై ఇజ్రాయిల్ ఆగ్రహం..
సావర్కర్ జయంతిని మే 28న జరుపుకున్నారు. ఆ తర్వాత ఈ పోస్టు వైరల్‌గా మారడంతో కర్ణాటక పోలీసులు చర్యలు తీసుకున్నారు. రెండు వర్గాల మధ్య శతృత్వాన్ని పెంపొందించడానికి ప్రయత్నించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొప్పల్ ఎస్పీ యశోధ వంటగోడి మాట్లాడుతూ.. సమాచారం అందుకున్న వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశామని, అతడు కూలీ పనులు చేసుకుంటున్నాడని తెలిపారు. మంగళవారం బెంగళూరులోని యలహంకలో సావర్కర్ పేరుతో ఉన్న ఫ్లైఓవర్‌పై సైన్‌బోర్డ్‌కు నల్ల ఇంక్‌ను పూశారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్‌యూఐ) సభ్యులు సైన్ బోర్డు ధ్వంసం చేశారని ఆరోపణలు ఉన్నాయి.