Karnataka: మరో జ్ఞానవాపిగా మంగళూర్ జుమా మసీద్… భారీ భద్రత ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశం అయింది. వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారంటూ హిందు సంఘాలు చెబుతున్నాయి. ఇటీవల వారణాసి కోర్ట్ జరిపిన వీడియో సర్వేలో మసీదులోని వాజుఖానలోని కొలనులో శివలింగం బయటపడిందన్న వార్తలు బయటకు వచ్చాయి. మసీదులో వీడియో సర్వేను ఆపాలంటూ అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ సుప్రీంలో పిటిషన్ వేయడం… శివలింగానికి భద్రత కల్పించాలని.. అలాగే ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే దేశంలో ప్రస్తుతం మథురలో శ్రీక్రిష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదం నడుస్తోంది. దీంతో పాటు కుతుబ్ మినార్, కర్ణాటకలో మాండ్యాలో జామియా మసీదు వివాదాల్లో చిక్కుకున్నాయి. తాజాగా మరో జ్ఞానవాపిగా మంగళూర్ లోని జుమా మసీదు మారింది. దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు నగర శివార్లలోని గంజిముట్ సమీపంలోని మలాలి ప్రాంతంలోని జుమా మసీదులో దేవాలయానికి సంబంధించిన నిర్మాణం బయటపడింది. వందల ఏళ్ల నాటి ఈ మసీదు పునరుద్దరణలో భాగంగా పనులు చేస్తున్న క్రమంలో దేవాలయ నిర్మాణాలు బయటపడటంతో ఒక్కసారిగా హిందు సంఘాలు యాక్టివ్ అయ్యాయి. ఒకప్పటి దేవాలయాన్ని కూల్చేసే మసీదును నిర్మించారని వీహెచ్పీ ఆరోపిస్తోంది.
Also Read
- Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
- Rahul Gandhi on NEET Paper Leak: "యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే".. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
ఇదిలా ఉంటే తాజాగా మలాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తం అయింది. మసీదుకు 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించింది. ఈ ఆంక్షలు మే 26 ఉదయం 8 గంటల వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. మసీదు సమీపంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.
తాజావార్తలు
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్‌గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!